Ind-Pak Match: ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్-నో హ్యాండ్ షేక్స్..ఫైనల్ టీమ్స్ ఇవే..!
కొలంబోలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ (T20 world cup india pakistan match) మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం భయాల మధ్య టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఆసియా కప్ నుంచి ఇరు జట్ల కెప్టెన్ల మధ్య ప్రారంభమైన నో హ్యాండ్ షేక్ సంప్రదాయాన్ని ఈ మ్యాచ్ లోనూ భారత్-పాక్ కెప్టెన్లు కొనసాగించారు. దీంతో హ్యాండ్ షేక్ లేకుండానే కెప్టెన్లు తలోదారి వెళ్లిపోయారు.
భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిషేక్ శర్మ తిరిగి వచ్చాడు. అలాగే కొలంబో పిచ్ ను దృష్టిలో ఉంచుకుని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం కల్పించారు. పాకిస్తాన్ జట్టులో టాప్ బ్యాట్స్ మెన్ ఫఖర్ జమాన్ కు చోటు దక్కుతుందని భావించినా అలా జరగలేదు. గత మ్యాచ్ ఆడిన జట్టునే పాకిస్తాన్ కొనసాగిస్తోంది. భారత్ ను కట్టడి చేయడం కంటే వారు ఇచ్చే లక్ష్యాన్ని ఛేదించడమే సులువని పాకిస్తాన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

భారత్, పాకిస్తాన్ తుది జట్లు ఇలా ఉన్నాయి.
ఇండియా XI: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్తాన్ XI: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్












Click it and Unblock the Notifications