IPL Auction 2025: ఐపీఎల్ లో వేలానికి రానున్న కదిరి కుర్రాడు..!

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న ఐపీఎల్ వేలం 2025కు సర్వం సిద్ధమైంది. ఈ వేలం ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిషాలకు వేలం ప్రారంభం అవుతుంది. మొదటి సెషన్ ముగిసిన తర్వాత బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత వేలం తిరిగి ప్రారంభం అయి రాత్రి 10 గంటల 30 నిమిషాలకు వేలం ముగుస్తుంది. మెగా వేలానికి 1577 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా.. ప్లేయర్ పూల్ ను 367 మంది భారతీయ ఆటగాళ్లు, 210 మంది విదేశీ ఆటగాళ్లతో 577కి తగ్గించారు.

10 ప్రాంచేజీలకు 204 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లకు 70 స్లాట్స్ ఉన్నాయి. అంటే.. జట్లు 204 మంది స్వదేశీ ఆటగాళ్లను, 70 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వేలంలో ఇద్దరు మార్క్యూ ప్లేయర్ జాబితాలను ప్రకటించారు. ఎం1లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, మిచెల్ స్టార్క్ ఉండగా.. ఎం2లో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఐపీల్ వేలం 2025 LIVE: మెగా వేలంలో ఆ అదృష్టవంతుడు ఎవరు..?

Raginath Reddy a boy from Kadiri Anantapur district is participating in the IPL auction 2025

డేవిడ్ మిల్లర్ మినహా మిగతా వారందరి బేస్ ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లలో అతి పెద్ద వయస్కుడైన ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ 43 ఏళ్లు ఉన్నాడు. బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వేలంలోకి పాల్గొంటున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలం పాల్గొనున్నారు. అతను వేలంలో రూ.30 బేస్ ప్రైస్ తో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఈ వేలంలో అత్యధిక రిజర్వ్ ధర రూ.2 కోట్లు ఉండగా.. అత్యల్ప రిజర్వ్ ధర రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగింది. మార్క్యూ ప్లేయర్ జాబితాతో వేలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్ రౌండర్లుగా వర్గీకరించి వేలం వేస్తారు. మొదటి సెట్ క్యాప్డ్ ప్లేయర్‌లను పరిచయం చేస్తారు. దీని తర్వాత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల వేలం ఉంటుంది. దీని తర్వాత, క్యాప్డ్ ప్లేయర్‌లతో కూడిన మరో రౌండ్ ఉంటుంది. వేలం ప్రక్రియ జియో సినిమాలో లైవ్ లో వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+