బెంగళూరుకు గుడ్ బై: రూటు మార్చిన RCB

డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ సొంత మ్యాచ్‌లను రెండు కొత్త స్టేడియాల్లో ఆడనుంది. భద్రత కారణాలతో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్, ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలు ఇకపై ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్‌లుగా మారనున్నాయి.

ఐపీఎల్ 2025 టైటిల్ సాధించిన తర్వాత బెంగళూరులో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల నేపథ్యంలో ఫ్రాంఛైజీ మళ్లీ బెంగళూరుకు తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదనే వార్తల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి, ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీ తన సొంత మ్యాచ్‌లన్నింటినీ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వస్తోంది. గత ఏడాది విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

RCB likely to Skips Bengaluru New Home Venues Named Ahead of IPL

ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన ఫ్రాంఛైజీతో పాటు సంబంధిత అధికారులపై తీవ్ర విమర్శలు, ప్రతికూల పరిస్థితులకు దారితీసింది. అప్పటి నుండి ఆర్సీబీ సొంత వేదిక మార్పులకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఐపీఎల్ 2026కి బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఫ్రాంఛైజీ ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడం గురించి ఇప్పటివరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ను సంప్రదించలేదని అంటున్నారు.

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో తన సొంత మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహించడానికి ఆర్సీబీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో అయిదు, రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లను ఆడేలా ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్టేడియాల్లో లాజిస్టికల్, ఆపరేషనల్ కార్యకలాపాల గురించి ప్రస్తుతం ఆర్సీబీ మేనేజ్మెంట్.. ఆయా నగరాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

డీవై పాటిల్ స్టేడియం గతంలో పలు ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. రాయ్‌పూర్ స్టేడియంలో కూడా పలు అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా జరిగాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం వల్ల ఆర్సీబీ యాజమాన్యం ఈ రెండు స్టేడియాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఐపీఎల్ 2026లో తమ సొంత మ్యాచ్‌లను పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+