పిల్లాపాపలతో ఆర్సీబీ స్టార్ ప్లేయర్లు: ఫ్రేమ్ అద్దిరిపోలా
ఐపీఎల్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకుంది. వరుసగా రెండో సీజన్ లో కూడా ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జీటీ నిర్ణీత 20 ఓవర్లల్లో 155 పరుగులే చేయగా.. దీన్ని 18 ఓవర్లల్లో అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. 161 పరుగులు చేసింది.
ఐపీఎల్ టైటిల్‌ను నిలబెట్టుకున్న వేళ.. అనుష్క శర్మ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె తన భర్త విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ వెనుక నుండి కనిపించే ఒక స్పెషల్ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో విరాట్ ధరించిన టీషర్ట్‌పై 'వన్ ఫెల్ట్ నైస్, యూ డిడ్ ఇట్ ట్వైస్' అని రాసి ఉండటం కనిపించింది. ఈ పోస్ట్‌కు ఆమె హార్ట్ ఎమోటికాన్‌ను జతచేశారు.

ఆర్సీబీ గెలుపు ఖాయం కావడంతో స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సంబరాలు మొదలయ్యాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని పూర్తి చేశారు. వీఐపీ పెవిలియన్ నుండి చూస్తున్న అనుష్క వెంటనే నిలబడి చప్పట్లు కొడుతూ విషెస్ చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనికి అనుష్క కూడా రిప్లై ఇవ్వడం కనిపించింది.
ఈ మ్యాచ్ కు దాదాపు ఈ రెండు జట్ల ప్లేయర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం వారి సందడి కనిపించింది. గ్రౌండ్ మొత్తం కోలాహలంతో నిండిపోయింది. విరాట్ కోహ్లీ- అనూష్క శర్మ, భువనేశ్వర్ కుమార్- నుపుర్ నగర్ వారి కుమార్తె అక్ష్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా- పంకురి శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ అంతా కలర్ ఫుల్ అనిపించింది. కప్ అందుకుంటోన్న సమయంలో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వారంతా కప్ తో కలిసి ఫ్యామిలీ ఫొటో దిగారు.












Click it and Unblock the Notifications