Ind Vs Eng T20: సూర్య సేనలో ఆ ఇద్దరూ ఔట్ - వారికి ఛాన్స్, తుది జట్టు..!!
Ind Vs Eng 4th T20: ఇంగ్లాండ్, భారత్‌ల మధ్య పుణె వేదికగా నాలుగో టీ20 కోసం రెండు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సూర్య సేన కైవసం అవుతుంది. రాజ్ కోట్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లోనూ ఊపు కొనసాగించాలని ప్లాన్ తో సిద్దం అయింది. అయిదు టీ20ల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 2-1 తో ఆధిక్యతతో ఉంది. కాగా, పూణే మ్యాచ్ లో సూర్య సేన లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇద్దరు ఆటగాళ్ల స్థానంలో మరో ఇద్దరితో తుది టీం కూర్పు జరుగుతోంది. ఈ మ్యాచ్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
కీలక సమరం
సిరీస్ డిసైడ్ చేసే పూణే మ్యాచ్ లో టీమిండియాలో మార్పులు జరుగుతున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడో మ్యాచ్‌లో అనుహ్యంగా ఓటమి ఎదుర్కొంది. పూణే పిచ్ కండీషన్ల ను చూసిన తరువాత తుది టీంలో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. స్పిన్ కు అనుకూలించే పిచ్ కావటంతో ఫైనల్ టీం కూర్పు కీలకంగా మారుతోంది. పూణే పిచ్ బ్యాటర్ల కు కూడా సహకరించేదిగా చెబుతున్నారు. దీంతో, మిడిల్ ఆర్డర్ లో మంచి రన్స్ సాధించాల్సిన అవసరం కనిపిస్తోంది. భారీ స్కోరు సాధిస్తే.. చేధన కష్టం గా కనిపిస్తోంది. దీంతో, జట్టులో మార్పులు చేయనున్నారు.

టీం ఇండియాలో మార్పులు
పూణేలో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు అంతర్జాతీయ టీ20లు జరిగాయి. కాగా, వాటిల్లో భారత్ రెండింటిలో గెలిచి మరో రెండింటిలో ఓడింది. గత రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెుదట బ్యాటింగ్ చేసిన జట్లు 200లకు పైగా స్కోర్ చేశాయి. టీం ఇండియా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న పేసర్ అర్షదీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అర్షదీప్‌ను తీసుకునే అవకాశం ఉంది. అటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను పక్కనపెట్టి శివందూబే తుది జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ లో విఫలమవుతున్న కెప్టెన్ సూర్యకుమార్‌పై మరోసారి ఒత్తిడి పెరుగుతోంది. పూణేలో సూర్య పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.

మారుతున్న లెక్కలు
ఇక, ఓపెనర్ సంజూ శాంసన్ ఆట తీరు పైన చర్చ సాగుతోంది. తన స్థాయికి తగినట్లుగా బ్యాటింగ్ చేయటం లేదు. హార్దిక్‌పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రాణిస్తున్నా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నారు. మూడో టీ-20 మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై ఆశలు పెరుగుతున్నాయి. ప్రపంచ కప్ తరువాతి తిరిగి ఆడుతున్న షమీ ఈ మ్యాచ్ ద్వారా పూర్వపు ఫామ్ లోకి వస్తారనే అంచనాలు ఉన్నాయి. అటు మూడో టీ20 లో అనూహ్య విజయం సాధించిన ఇంగ్లాండ్ సైతం పూణే మ్యాచ్ కోసం కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. దీంతో, ఈ మ్యాచ్ తో సిరీస్ డిసైడ్ అవుతుందా.. సమం అవుతుందా అనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications