వామ్మో.. కోహ్లీ రెస్టారెంట్‌లో బిర్యానీ రేటు ఎంతో తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో ఎంత క్రేజ్ ఉందో, ఆయన వ్యాపారాలకు కూడా అంతే ప్రచారం లభిస్తోంది. ఇటీవల కోహ్లీకి చెందిన ఒక రెస్టారెంట్ మెనూ కార్డు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. సాధారణ ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా అసాధారణంగా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సాధారణ రెస్టారెంట్లలో ₹100 నుంచి ₹150 ఉండే చికెన్ బిర్యానీ ధర, కోహ్లీ రెస్టారెంట్ మెనూలో ₹978 (లక్నో దమ్ ల్యాంబ్ బిర్యానీ)గా ఉంది. చికెన్ చెట్టినాడ్ బిర్యానీ కూడా ₹878గా ఉంది. కేవలం ఒక ప్లేట్ ప్లెయిన్ రైస్ కోసం కూడా కస్టమర్లు ₹318 చెల్లించాల్సి వస్తోంది.

అత్యంత ఖరీదైన వంటకాలు:
మెనూలో అత్యధిక ధర కలిగిన వంటకం నాన్-వెజ్ ల్యాంబ్ షాంక్, దీని ధర ₹2,318గా ఉంది. ఇక తందూరీ రోటీ, నాన్ వంటి సాధారణ బ్రెడ్ ఐటమ్స్ ధర ₹118 చొప్పున ఉంది.
డిజర్ట్స్ (Deserts) విషయానికి వస్తే:
కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మౌస్: ₹818
సిగ్నేచర్ సిజ్లింగ్ క్రోసెంట్: ₹918
మస్కార్పోన్ చీజ్ కేక్: ₹748
ఈ ధరల పట్టిక జొమాటో (Zomato) వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండటంతో, సామాన్య కస్టమర్లు ఈ రేట్లపై నోరెళ్లబెడుతున్నారు. ప్రముఖులు నడుపుతున్న రెస్టారెంట్లలో అంతర్జాతీయ స్థాయి వంటకాలకు, వాతావరణానికి అనుగుణంగానే ధరలు ఉంటాయని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ రేట్లను విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications