ఎవరీ శ్రీచరణి, కడప టు వరల్డ్ కప్ ఫైనల్ - సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు..!!
నల్లపురెడ్డి శ్రీచరణి. మహిళల ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర. మహిళా క్రికెట్ టీంలో అనూహ్యంగా స్థానం దక్కించుకొని తన సత్తా చాటింది. తెలుగు బిడ్డ అయిన శ్రీచరణి ఫైనల్ మ్యాచ్ లో కీలక సమయంలో వికెట్ తీసి టీంలో జోష్ నింపింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల ను ఎదుర్కొని టీం ఇండియాలో ఇప్పుడు కీలక ప్లేయర్ ఎదిగింది. ఫైనల్ మ్యాచ్ లో అందరి ప్రశంసలు అందుకున్న ఈ ఆణిముత్యం సక్సెస్ స్టోరీ స్పూర్తి దాయకం..
శ్రీచరణి ప్రపంచ కప్ ఫైనల్ లో సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. తన వైవిధ్యమైన బౌలింగ్ తో అందరి ప్రశంసలు అందుకున్న ఈ శ్రీచరణి సక్సెస్ వెనుక ఎన్నో ఆసక్తి కర అంశాలు ఉన్నాయి. కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన శ్రీచరణి ఈ ప్రపంచ కప్ లో మొత్తం మ్యాచ్‌ల్లో 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీశారు. ఆమె కీలక మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టింది. ఫైనల్ లో శ్రీచరణి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కడప జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఇప్పుడు క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. పేదరికం, కష్టాలు... అన్నిటినీ ఎదురించి స్పూర్తి దాయకంగా మారింది.

శ్రీచరణి చిన్నతనంలో బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపింది. 16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ కోచింగ్.. సహకారం కావాల్సిన వేళ ఆర్దికపరమైన సమస్య లు వెంటాడాయి. తొలుత నిరాకరించినా.. తరువాత కుటుంబ సభ్యుల నుంచి సహకారం రావటం తో మరింత పట్టుదలతో శ్రీచరణి క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు చరణి మొదట ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్‌లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్‌ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా మారింది.
తన కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సెలెక్టర్ల దృష్టిలో పడింది.రూ 55 లక్షల పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. సీనియర్ మహిళల భారత - బీకి ఆడి తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇక..ఇప్పుడు ప్రపంచ కప్ తుది టీంలో అనూహ్యంగా స్థానం సాధించి. తన బౌలింగ్ తో ఫైనల్ లో సత్తా చాటింది. బ్యాటింగ్ కు కలిసొచ్చే డైవీ స్టేడియం పిచ్ పైన తన వైవిధ్య మైన బౌలింగ్ తో ప్రత్యర్ధి టీంను తిప్పలు పెట్టిది. టీమిండియా ఆణిముత్యంగా పిలుపుచుకొనే శ్రీచరణి ఇప్పుడు టీం ఇండియా విశ్వ విజేత కావటంలో కీలకంగా వ్యవహరించింది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.












Click it and Unblock the Notifications