SKY: సూర్యకు మరో బిగ్ షాక్ ? సోషల్ మీడియాలో హింట్..!

టీమిండియాకు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ (Suryakumar Yadav)కు అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదు. ఈ విజయం తర్వాత వచ్చే టీ20 వరల్డ్ కప్ కూ సూర్య కెప్టెన్ గా కొనసాగుతాడని అభిమానులు, క్రికెట్ వర్గాలు భావించాయి. కానీ వయసు మీద పడుతున్న ప్రభావమూ, మరే ఇతర కారణామో తెలియదు కానీ.. అనూహ్యంగా ఫామ్ కోల్పోయాడు. దీంతో త్వరలో ఇంగ్లండ్ టూర్ కు టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా జట్టులో స్ధానం కూడా దక్కించుకోలేకపోయాడు. ఈ షాక్ లు కొంతవరకూ ఊహించినవే అయినా ఇప్పుడు మరో షాక్ తప్పేలా లేదు.

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తొలగింపు, జట్టులో చోటు కోల్పోవడంతో, తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకునేందుకు సూర్య కష్టపడాల్సిన పరిస్ధితి నెలకొంది. మళ్ళీ సూర్య జాతీయ జట్టులోకి రావడం కష్టతరమైనప్పటికీ, ముంబై ఇండియన్స్‌తో ఆయనకు ఉన్న బంధం కూడా ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇవాళ ఉదయం సూర్యకుమార్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన ఫోటోలు లేదా ఏ విధమైన ప్రస్తావనలు కనిపించకపోవడం, ఆయన ఫ్రాంచైజీ నుంచి తప్పుకోనున్నారనే ఊహాగానాలకు బలాన్నిచ్చింది.

SKY Goes Dark After T20 Captaincy loss Suryakumar Yadav s Social Media Wipe Sparks Mumbai Indians Exit Buzz

2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లో చేరిన సూర్యకుమార్, గత కొన్నేళ్లుగా ఆ జట్టు విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అయితే, ఐపీఎల్ 2026లో స్కై ప్రదర్శన అత్యంత పేలవంగా ఉండటంతో, యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానానికి పడిపోవడానికి సూర్య ఫామ్ లేమి కూడా ప్రధాన కారణమైంది. ఆ సీజన్‌లో సూర్య 20.77 సగటుతో కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. దీంతో సూర్యను తప్పించేందుకు ముంబై రెడీ కావడం, అందుకు తగ్గట్టుగానే తానే ముందుగా ముంబైనీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అన్ ఫాలో కావడం జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+