క్వీన్ ఆఫ్ క్రికెట్: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ లో నూతన సంచలనం సృష్టించారు. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. అగ్రస్థానానికి దూసుకెళ్లారు. ఆసియా గేమ్స్ లో భాగంగా జపాన్ లోని నగోయా కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఈ ఘనతను సాధించారు. ఈ మైలురాయిని అందుకున్నారు.
దీంతో న్యూజిలాండ్ దేశానికి చెందిన దిగ్గజ మహిళా క్రికెటర్ సూజీ బేట్స్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు ప్రపంచ రికార్డును స్మృతి మంధాన బద్దలు కొట్టారు. సూజీ బేట్స్ తన కెరీర్‌లో ఆడిన 186 మ్యాచ్‌ల్లో సాధించిన 4,758 పరుగులు చేయగా.. దీన్ని మంధాన దాటేశారు. ప్రస్తుతం మంధాన ఖాతాలో 4,765 పరుగులు చేరాయి. ఈ ఫార్మాట్‌లో ఆమె మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్ గా నిలిచారు. భారత క్రికెట్ ప్రస్థానంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. టీ20 ఇంటర్నేషనల్స్ లో 100 సిక్సర్లు కొట్టిన మొదటి మహిళా క్రికెటర్ గా కూడా మంధాన నిలిచారు.

టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లల్లో స్మృతి మంధాన- 4,765 నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. సూజీ బేట్స్ (న్యూజిలాండ్)- 4,758, హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్)- 4,287, చమరి ఆటపట్టు (శ్రీలంక)- 4,282, సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 3,817 ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ లో స్మృతి మంధాన మొదటి ఓవర్ నుంచే దూకుడును ప్రదర్శించారు. 19 బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఆమె అయిదు ఫోర్లు రెండు భారీ సిక్సర్ల సహాయంతో మెరుపు వేగంతో 37 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మతో కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 72 పరుగుల విలువైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యం భారత జట్టు భారీ స్కోరు సాధించడానికి అత్యంత పటిష్టమైన పునాది వేసింది.
మూడు ఫార్మాట్లలో కలిపి స్మృతి మంధాన ఇప్పటివరకు మొత్తం 10,964 పరుగులు నమోదు చేశారు. ఇందులో కూడా ఆమెనే టాప్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన మహిళల టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రస్తుతం షెఫాలి వర్మ- 95, రిచా ఘోష్ 0 పరుగులతో ఆడుతున్నారు. మంధాన- 37, గుణలన్ కమిలిని- 3, హర్మన్ ప్రీత్ కౌర్- 40 పరుగులు చేసిన అవుట్ అయ్యారు.












Click it and Unblock the Notifications
