భారత్ కు సెమీస్ లైన్ క్లియర్ చేసిన సౌతాఫ్రికా - ఇక తేలాల్సింది అక్కడే..!!

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో టీం ఇండియా సెమీస్ పైన అంచనాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. కీలకమైన రెండు మ్యాచుల వేళ దక్షిణాఫ్రికా అహ్మదాబాద్ సూపర్ -8 రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించింది. పాయింట్ల పట్టికలో భారత్ కు ఇది కలిసొచ్చే అంశం. ఇక.. ఇప్పుడు జింబాబ్వే పైన భారీ విజయం నమోదు చేయాల్సిన బాధ్యత సూర్య సేనదే. జింబాబ్వే తో పాటుగా ఆదివారం వెస్టిండీస్ పైన టీమిండియా విజయం సాధిస్తే.. సెమీస్ అవకాశం భారత్ కు ఖాయం గా కనిపిస్తోంది. దీంతో.. జింబాబ్వేతో ఫలితం ఏంటనేది కీలకంగా మారుతోంది.

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ ను పూర్తిగా నియంత్రించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రొమారియో షెఫర్డ్(52*; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జాసన్ హోల్డర్(49; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో అర్ధ శతకం మిస్ చేసుకున్నాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణ ఆఫ్రికా బ్యాటర్లు ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించాడు. కెప్టెన్ చివరి వరకు బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు. దీంతో.. ఇప్పుడు ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్ చేరింది. ఇప్పుడు టీం ఇండియా చేరేందుకు మార్గం సుగమం చేసారు.

south-africa-clears-the-route-for-team-india-semis-after-winning-against-west-indies-in-ahmedabad

దక్షిణాఫ్రికా విజయం తో తప్పిన రన్ రేట్ టెన్షన్

సౌతాఫ్రికా తాజా గెలుపుతో టీంలో అగ్ర స్థానంలో ఉంది. రెండో స్ధానం కోసం మూడు టీంలు పోటీ పడుతున్నాయి. ఇక.. ఇప్పుడు జింబాబ్వేతో భారత్ భారీ విజయం సాధించాల్సి ఉంది. అదే విధంగా వెస్టిండీస్ పైన విజయం సాధించాలి. జింబాబ్వే ఆట తీరు గతం కంటే పూర్తి భిన్నంగా ఉంది. దీంతో.. టీం ఇండియా తుది జట్టు ఎంపిక కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన టీం పై చేయి సాధించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్లు అందరూ జింబాబ్వేను తక్కువ అంచనా వేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇక.. ఇప్పుడు చెన్నైలో జింబాబ్వేతో గెలుపు కాదు.. అంతకు మించి అనే స్థాయిలో గెలిచి చూపించాలి. -3.80 నెట్ రన్ రేటుతో ఉన్న టీమిండియా ఇప్పుడు దక్షిణాఫ్రికా విజయం తో రన్ రేటు టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్ గెలిస్తే సెమీస్ కు చేరేందుకు టీమిండియాకు లైన్ క్లియర్ అవుతుంది. దీంతో.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో వేచి చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+