SRH కెప్టెన్సీ నుంచి ఇషాన్, ఆ ప్లేయర్ ఔట్- స్టార్ ఆల్ రౌండర్ రీ ఎంట్రీ..!!

SRH IPL 2026: సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు. ఐపీఎల్ లో రెండో విజయం నమోదు చేసుకున్న సన్‌రైజర్స్ ఈ నెల 18న ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులో కీలక ఆటగాడు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆ స్థానంలో మరో బౌలర్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా, ఇషాన్ కిషన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్న ఇషాన్ కిషన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో జట్టులోనూ మార్పులు జరగుతున్నాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో కుడి చేతికి గాయం కావడంతో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇది ఆరెంజ్ ఆర్మీకి ఇబ్బందిగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అతడి స్థానంలో యాజమాన్యం శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్సాన్ మధుశంకను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. మధుశంక స్వింగ్ బౌలింగ్‌ తో బ్యాటర్లను ముప్ప తిప్పులు పెట్టగలడు. కాగా, ఫిట్‌నెస్ సమస్యలతో ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రానుండటం ఊరటనిచ్చే అంశం.

SRH have got a huge boost as their captain Pat Cummins is set to rejoin the side soon as reports

ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని, ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అన్ని టీంలకు మింగుడు పడని రాజస్థాన్ రాయల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ కు తిరిగి కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్ సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్​ ను ఢీ కొట్టనుంది. వెన్నుగాయం కారణంగా కొన్ని రోజుల నుంచి కమిన్స్​ ఆటకు దూరంగా ఉంటున్నాడు. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచుల్లో ఏడు నెగ్గాల్సిన పరిస్థితి ఉంది. కాగా.. కమిన్స్ కెప్టెన్ గా తిరిగి రావటం జట్టుకు అదనపు బలంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+