రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!
టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అనేక అనుమానాలకు... విమర్శలకు తన ఆటతో ధీటైన సమాధానం చెప్పింది. ఏకపక్షంగా ఫైనల్ లో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా వరుసగా మూడో సారి అవతరించి కొత్త రికార్డు నెలకొల్పింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన టీంగా ఆవిర్భవించింది. ఇదే సమయంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టీంను ముందుండి గెలిపించాడు. ఇదే సమయంలో సూర్య రిటైర్మెంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా.. సూర్య కుమార్ తన రిటైర్మెంట్ పైన కీలక ప్రకటన చేసారు.
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే వన్డేలు, టీ20లు కలిపి చూసుకుంటే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఐదో కెప్టెన్. సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య పెద్దగా రాణించలేకపోయాడు. ఒక్క అమెరికాతో మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సూర్య నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సూర్య, టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఫైనల్ ముందు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఫైనల్ లో పరుగులు ఏం చేయకుండానే సూర్య కుమార్ అవుట్ అయ్యాడు. దీంతో.. ఇక సూర్య సెలవు తీసుకోవటం ఖాయమని అందరూ భావించారు. కివీస్ బ్యాటింగ్ సమయంలో టీం ను ముందుడి అద్భుతంగా నడిపించాడు. ఫీల్డింగ్ లో క్యాచులు మిస్ అయినా.. టీం సభ్యులకు మద్దతుగా నిలిచాడు. అభిషేక్ 50 చేయగానే ప్రోత్సాహం అందించిన తీరు పెద్ద ఎత్తున వైరల్ అయింది.
రిటైర్మెంట్ పై తేల్చేసిన సూర్య కుమార్
కోచ్ గంభీర్ తో సమన్వయం చేసుకుంటూ... కివీస్ బ్యాటర్లను కట్టడి చేయటంలో బౌలర్లను ఎప్పుడు ఎవరిని ఎలా వినియోగించుకోవాలో సూర్య పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో...ఫైనల్ మ్యాచ్ అనంతరం కోచ్ గంభీర్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సూర్య తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు. రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'ప్రస్తుతం అంతా బాగానే ఉందిగా. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు' అని సమాధానం ఇచ్చాడు.
అదే సమయంలో తన టీమ్‌లోని సభ్యులను సూర్య ప్రశంసలతో ముంచెత్తాడు 'బూమ్రా లాంటి బౌలర్ జనరేషన్‌కు ఒకసారే వస్తాడు. అతడు మన దేశానికి గొప్ప నిధి. ఎప్పుడు ఎలా బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. ఇక, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ టాప్ క్లాస్ ప్లేయర్స్. మా టీమ్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇలాంటి జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం' అని సూర్య వ్యాఖ్యానించారు. దీంతో, సూర్య రిటైర్మెంట్ వార్తలకు ముగింపు ఇచ్చాడు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications