T20 World Cup 2024: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర ఇదే ? బుకింగ్ ఇలా..

ఈ ఏడాది జూన్ లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మెగా టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్టేడియాలు అతి చిన్నవి కావడమే. దీంతో ఈసారి టీ20 వరల్డ్ కప్ కోసం టికెట్ల విక్రయాలను ప్రారంభించిన ఐసీసీ.. ఇందుకోసం పబ్లిక్ బ్యాలెట్ పేరుతో కొత్త విధానం అమలు చేస్తోంది.

పబ్లిక్ బ్యాలెట్ విధానంలో టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన 2 లక్షల 60 టికెట్లను ఐసీసీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. అయితే వీటిని నేరుగా కొనుక్కోవడానికి వీలుండదు. పబ్లిక్ బ్యాలెట్ విధానంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇలా వచ్చిన దరఖాస్తుల్లో ఐసీసీ ర్యాండమ్ విధానంలో టికెట్లను కేటాయిస్తుంది. దీంతో ముందుగా లాగిన్ అయి టికెట్లు కొనుక్కుందామని భావించిన వారికి నిరాశ తప్పడం లేదు.

T20 World Cup 2024: India-Pakistan Match Ticket Price and How to Get it?

అదే సమయంలో జూన్ 9న న్యూయార్క్ లో జరిగే కీలకమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల కోసం ఈ డిమాండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు ఐసీసీ అందుబాటులో ఉంచిన పబ్లిక్ బ్యాలెట్ ఎల్లుండితో ముగియనుంది. ఈ నేపథ్యంలో లీగ్ దశలో మ్యాచ్ ల కోసం నిర్ణయించిన ధర చెల్లించి టికెట్ రేసులో నిలిచేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. అలాగే వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి ఒక్కో మ్యాచ్ కు గరిష్టంగా ఆరు టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు.
దీంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ దక్కించుకునేందుకు అభిమానుల మధ్య తీవ్ర పోటీ ఉంది.

మరోవైపు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు టికెట్లను మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంచారు. న్యూయార్క్ లో తాజాగా నిర్మించిన స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు ప్రీమియం (175 డాలర్లు లేదా రూ.14,550), స్టాండర్డ్ ప్లస్ (300 డాలర్లు లేదా రూ.25 వేలు), స్టాండర్డ్ (400 డాలర్లు లేదా రూ.33,300) ధరలుగా నిర్ణయించారు. వీటిని బుక్ చేసుకోవాలంటే tickets.t20worldcup.com వెబ్ సైట్ లోకి వెళ్లి అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. అందులో భారత్-పాక్ మ్యాచ్ ను ఎంచుకోవాలి. షరతులు, నిబంధనలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇందులో ఎంపికైన వారికి మెయిల్ ద్వారా వివరాలు లభిస్తాయి. అప్పుడే డబ్బులు చెల్లించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+