Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్?: ఆ దేశానికి లక్కీ ఛాన్స్!

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనానికి దారితీసింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐసీసీ తీరుపై మండిపడుతున్న పాకిస్థాన్.. తాము కూడా ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది.

ఐసీసీపై పీసీబీ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్ఢు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీపై 'ద్వంద్వ ప్రమాణాలు' పాటిస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ వంటి ప్రధాన భాగస్వామిని టోర్నీ నుండి ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ప్రధాని విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

t20 world cup 2026 Will Pakistan Quit Mega Event ICC Warns PCB Uganda May Replace Pakistan

పాక్ స్థానంలో ఉగాండాకు ఛాన్స్?

ఒకవేళ పాకిస్థాన్ గనుక ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో 14వ ర్యాంకులో ఉన్న స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. పాకిస్థాన్ తప్పుకుంటే.. టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఉగాండా (21వ ర్యాంకు) కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రపంచకప్‌లోనూ ఉగాండా ఆకట్టుకుంది.

గ్రూప్-A లో మార్పులు
పాకిస్థాన్ స్థానంలో ఉగాండా వస్తే, ఆ జట్టు గ్రూప్-A లో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో తలపడాల్సి ఉంటుంది. పాక్ వంటి అగ్రశ్రేణి జట్టు తప్పుకోవడం టోర్నీ వ్యాపార ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐసీసీ కఠిన హెచ్చరిక

మరోవైపు పీసీబీ బెదిరింపులపై ఐసీసీ సీరియస్ అయింది. ప్రపంచకప్ నుండి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం విధిస్తామని, ఆసియా కప్ నుండి తొలగిస్తామని, పీఎస్ఎల్ (PSL) ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీ (NOC) నిరాకరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు "బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరించింది. మా ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తాం," అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+