సౌతాఫ్రికా - వెస్టీండీస్ మ్యాచ్ ఫలితం పై భారత్ సెమీస్ లెక్కలు - డూ ఆర్ డై..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. సెమీస్ కు వెళ్లాలంటే ఈ రెండు మ్యాచుల ఫలితం టీమిండియా కీలకంగా మారుతున్నాయి. జింబాబ్వేతో విజయం మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లుగా గెలుపు ఉండాలి. రన్ రేటు పెంచుకోవటం అత్యవసరం. అదే విధంగా ఈ రోజు జరిగే మరో మ్యాచ్ లో వెస్టిండీస్ పైన సౌత్ ఆఫ్రికా గెలుపు భారత్ కు అవసరం. దీంతో.. ఇప్పుడు ఈ మ్యాచ్ పైనా టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తి తో ఉన్నారు. ఈ రెండు మ్యాచుల ఫలితాలు టీమిండియా సెమీస్ ను డిసైడ్ చేయనున్నాయి.
టీ20 ప్రపంచ కప్2026 గ్రూప్-1 లో నేడు రెండు సూపర్ -8 మ్యాచులు జరుగుతున్నాయి. ఒక మ్యాచులో భారత్ - జింబాబ్వే మ్యాచ్ తో పాటుగా సౌతాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు సూపర్ - 8 లో ఆసక్తిగా మారుతున్నాయి. దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచులో భారత్ ఫ్యాన్స్ దక్షిణాఫ్రికా గెలవాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత జింబాబ్వే మ్యాచ్‌లో భారీ నెట్ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. అలానే వెస్టిండీస్ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీస్ బెర్తు గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే నెట్ రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

సౌతాఫ్రికా గెలిస్తే భారత్ సెమీస్ ఆశలు సజీవం
మొత్తంగా జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. అందుకే టీమిండియాతో పాటు అభిమానులు కూడా ప్రొటీస్ జట్టు గెలవాలి అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగుతోంది. మరోవైపు బలమైన ఆస్ట్రేలియాకు, శ్రీలంకకు షాకిచ్చి సంచలన ప్రదర్శన కనబరుస్తున్న జింబాబ్వే కూడా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. దాంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి జింబాబ్వేది. చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ వరల్డ్ కప్‌లో స్ట్రయిక్ రేట్, సగటు స్కోర్ల కోణంలో పరిశీలిస్తే ఈ వికెట్‌కన్నా ఉత్తమమైనది మరొకటి లేదు. నల్ల మట్టితో తయారు చేసిన పిచ్‌పై మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications