T20 World Cup Super 8: సూపర్ 8రేస్ మొదలు-2 జట్లు ఖరారు-మరో 6 బెర్తుల పోటీ..!
భారత్-శ్రీలంక ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup)లో గ్రూప్ దశ పోరులో సగం మ్యాచ్ లు ముగిసిపోవడంతో సూపర్ 8 (super 8) కోసం రేస్ మొదలైంది. నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్లు చొప్పున మొత్తం 20 జట్లు సూపర్ 8 లో చోటు సంపాదించేందుకు పోటీ ప్రారంభించగా.. ఇందులో రెండు జట్లు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఇప్పటికే మూడేసి విజయాలతో తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇక మిగిలిన ఆరు బెర్తుల కోసం కనీసం 7 జట్లు పోటీ పడుతున్నాయి.
సూపర్ 8 లెక్క ఇలా..
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో మొత్తం 8 జట్లకు అవకాశం ఉంటుంది. నాలుగు గ్రూప్ ల నుంచి తలో రెండు జట్ల చొప్పన సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. తమ గ్రూప్ లో అత్యధిక పాయింట్లు సాధించిన తొలి రెండు జట్లకు సూపర్ 8 అర్హత లభిస్తుంది. జట్ల మధ్య పాయింట్లు సమమైతే నెట్ రన్ రేట్ ఆధారంగా సూపర్ 8 బెర్త్ ఖరారు చేస్తారు. అయితే వీటితో సంబంధం లేకుండా నేరుగా పాయింట్లు సాధిస్తే మాత్రం సూపర్ 8లోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది.

సూపర్ 8కు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
ఇలా నేరుగా మూడేసి విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకూ సూపర్ 8 బెర్త్ లు ఖరారు చేసుకున్నాయి. మిగతా ఆరు బెర్తుల కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఇవాళ జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఒకరు సూపర్ 8కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే గ్రూప్ ఏలో తలో రెండు విజయాలతో నాలుగేసి పాయింట్లు సాధించిన భారత్-పాకిస్తాన్ జట్లలో ఇవాళ మ్యాచ్ గెలిచిన వారికి ఆరు పాయింట్లు లభిస్తాయి. దీంతో వారికి సూపర్ 8 బెర్త్ ఖరారైనట్లే. ఓడిన జట్టుకు కూడా తమ చివరి మ్యాచ్ లో గెలిస్తే బెర్త్ దక్కుతుంది.

మిగిలిన బెర్తుల కోసం పోటీ
ఇక గ్రూప్ బీలో చూసుకుంటే శ్రీలంక, జింబాబ్వే తాము ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. వీరు తాము ఆడే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెల్చినా సూపర్ 8 బెర్త్ ఖాయం. ఇదే గ్రూపులో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటివరకూ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయినా మరో రెండు మ్యాచ్ ల్నీ గెలిస్తే సూపర్ 8 కు చేరుతుంది. గ్రూప్ సీలో ఇప్పటికే వెస్టిండీస్ సూపర్ 8కు చేరగా, సూపర్ 8లో మరో బెర్త్ కోసం ఇంగ్లాంగ్ కు అవకాశం ఉంది. గ్రూప్ డీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా సూపర్ 8కు చేరింది కాబట్టి మరో బెర్త్ కోసం న్యూజీలాండ్ కు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications