రేపటి సంగతి


హైదరాబాద్: రేపు వెలువడనున్నఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో మధ్యాహ్నంవరకు కూడికలు వేసుకుంటూ కూర్చోనవసరం లేదు. రేపుఉదయం తొమ్మిది గంటలకు పోలీసు ఉన్నతాధికారులు రాజశేఖరరెడ్డిఇంటి వద్ద కన్పించారంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకివచ్చినట్టే. పోలీసు అధికారులు అక్కడ కన్పించలేదంటేచంద్రబాబు నాయుడికి అవకాశాలు ఉన్నట్టే. ప్రతి ఐదేళ్ళకోసారిఎన్నికల ఫలితాల రోజు పోలీసు ఉన్నతాధికారుల బుద్ధి ఇలాబయటపడుతూ ఉంటుంది.
తొమ్మిదేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడుఅప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గద్దె దింపడానికిఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో ఉంచినప్పటి సంగతి గుర్తుందా?హోటల్‌కు వస్తున్న ఎమ్మేల్యేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పోలీసుయంత్రాంగం వైఖరిలో మార్పు వచ్చింది. ఎన్టీఆర్ వంటిమహానాయకుడిని వదిలి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకుఎందుకు మద్దతు ఇస్తారని వాదించిన పోలీసు ఉన్నతాధికారులు కొన్నిగంటల వ్యవధిలో తమ అభిప్రాయాలు మార్చుకుని టోపీలనుసరిచేసుకోవలసి వచ్చింది.
అప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌తన చైతన్య రథం ఎక్కి వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు.బయటికి రావలసిందిగా ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్‌పక్కన లక్ష్మీపార్వతి అప్పటి హోంమంత్రి ఇంద్రారెడ్డి ఉన్నారు. ఎన్టీఆర్‌పిలుపునకు ఎమ్మెల్యేలు స్పందించలేదు సరి కదా వైస్రాయ్ హోటల్‌పైనుంచి ఎన్టీఆర్ వాహనం మీద చెప్పులు పడ్డాయి. ఇంద్రారెడ్డి హోటల్‌గేటు తెరిపించే ప్రయత్నం చేశారు.
అంతకు ముందు గంటక్రితంవరకు ఎన్టీఆర్‌కు ఇంద్రారెడ్డికి పరమ విధేయంగామసలుకున్న అప్పటి పోలీసు కమిషనర్ అప్పారావు ఇంద్రారెడ్డినిభుజం పట్టుకుని ఆపారు. నేను ఇప్పటికీ హోంమంత్రిని. నన్నులోపలికి వెళ్ళనివ్వండి అని ఇంద్రారెడ్డి గద్దించినాలాభంలేకపోయింది. ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడు పోలీసుఉన్నతాధికారుల ప్రవర్తన ఇలాగే ఉంటుంది.
రేపటి ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడుమీకు అందించడానికి దట్స్‌తెలుగుడాట్ కాం ఏర్పాట్లు చేసింది.రేపు ఉదయం ఎనిమిదిన్నర నుంచి కౌంటింగ్ ట్రెండ్స్‌తో పాటు ఫ్లాష్‌నుమీకు అందిస్తాం.
ఇటీవలికథనాలు
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!