• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెయ్యికార్ల ర్యాలీ

By Staff
|

హైదరాబాద్‌:దేశ విదేశాల్లో లక్షలాది భక్తులకుఆరాధ్య దైవమైన త్రిదండి చినజీయర్‌ స్వామి సరిగ్గా నెల రోజుల తర్వాత నవంబరు ఆరున విజయవాడనుంచి తిరుమల వరకు వెయ్యికార్లతో ర్యాలీనిర్వహించనున్నారు. ఆయన ఆశ్రమానికిఅనుబంధంగా ఉండే వికాసతరంగిణి వారు రాజకీయ ర్యాలీలనుమరిపించే రీతిలో ఈ ర్యాలీకి ప్రణాళిక సిద్ధంచేశారు. తిరుమలలో వేయికాళ్ళ మంటపాన్నిఅదే స్ధానంలో తిరిగి నిర్మించాలని జీయర్‌ స్వామిగట్టిగా కోరుతున్నారు. ఈ లక్ష్యం సాధించుకోడానికినిరాహార దీక్ష చేయాలని ఆ మధ్య స్వామి నిర్ణయించగాదేవాదాయ శాఖ మంత్రి దిగివచ్చి స్వామి వారిడిమాండును అంగీకరిస్తున్నామనిప్రకటించి ఆయనను శాంతింపజేశారు.

ఆ తర్వాత వైఎస్‌రాజశేఖరరెడ్డి వెయ్యి కాళ్ళ మంటపాన్నిఎలా ఎక్కడ నిర్మించాలన్న విషయంపైసిఫార్సు చేసేందుకు ఆగమ పండితులతోఒక కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. దేవాదాయ శాఖమంత్రి సత్యనారాయణరావు కూడామాట మార్చారు. దీనిపై వివాదంగట్టిగా ఉన్నందున దీని మీద కమిటీవేయడమే మంచిదని భావించామని చెప్పారు. ప్రభుత్వంమాట మార్చినందుకు స్వామి వారికి ఆగ్రహం వచ్చింది. తిరుమలలోవెంకటేశ్వర స్వామికి శాస్త్రోక్తంగాపూజలు జరగడం లేదని కూడా జీయర్‌స్వామి గతంలో అనేక సార్లు ఆవేదనవ్యక్తం చేశారు.

తిరుమలఆలయవ్యవహారాలకు, జీయరు స్వామికి ఎటువంటిసంబంధం లేదని ఆగమ శాస్త్ర పండితులుఅంటున్నారు. తిరుమల వెంకటేశ్వరుడినిబజారు మహిళగా కొందరు చూడడంవిచారకరం అని అదే సందర్భంలో చిన జీయర్‌స్వామి చేసిన ఒక ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తిరుమలప్రధాన అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడుజీయరు స్వామి తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు.

విజయవాడసమీపంలోవేదపాఠశాల నిర్వహించుకుంటున్నచినజీయర్‌ స్వామి ఆధ్యాత్మిక రంగంలోమెగాస్టార్‌ చిరంజీవిలా మారాలనుకుంటున్నారని,అందువల్ల ఆయన కారు ర్యాలీలతోరాజకీయం చేస్తున్నారని విమర్శలువస్తున్నాయి. ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూఅవసరమైతేనే నోరుమెదపాల్సిన స్వామీజీలు రోడ్ల మీదికిరావడం అనుచితమని కొందరుఅభిప్రాయ పడుతుండగా ఒక మంచి పనికోసం ఎవరో ఒకరు ముందు నడవాలికదా అని స్వామీజీ భక్తులు అంటున్నారు.

ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!

సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు

అనంత ఎస్పీ అనుభవం

కెసిఆర్‌కు చివరకు మిగిలింది?

మనమే వీసాల వీరులం!

తెలుగుసినిమా దుస్ధితి

మేనేజర్‌గాగవాస్కర్‌

వైఎస్‌ భలే చర్య

ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X