వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట్లురాలుతాయా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Tuesday, May 11 2004

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడిఅభివృది్ధ గారడి గాలికెగిరిపోయింది. కాంగ్రెస్‌ నేలబారువాగ్దానాలు బాగా పనిచేశాయి. సామాన్యుల గుండె ఇన్నాళ్ళుగాఇంత బాధ పడిందన్న నిజం నేడు బయటపడింది. ఎండమావి వంటి అభివృద్ధికంటే తక్షణ ఉపశమనాన్ని సగటు ఓటర్లు కోరుకున్నట్టుతెలుస్తోంది. సామాన్యులకు తన ప్రభుత్వం ఇంత దూరమైపోయిందన్న వాస్తవం గ్రహించిన చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికలిగించి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశంచిన్నాచితకా నాయకులు నయా సంపన్నులు కావడంసామాన్యజనంలో ఆగ్రహానికి కారణమయ్యాయి. మహిళలేతన ఓటు బ్యాంకు అని గుడ్డిగా నమ్మిన చంద్రబాబు నాయుడికిఇప్పుడు వాస్తవం తెలిసిఉంటుంది. చంద్రబాబు నాయుడు హయాంలోడ్వాక్రా మహిళానాయకులు తప్ప సగటు మహిళలు కష్టాలేపడ్డారు. కరెంటు బిల్లులు బాగా పెరగడంతో పేద,మధ్యతరగతికి మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఈ బాధ పురుషులకంటే మహిళలకే ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుమళ్ళ గెలిస్తే కరెంటు బిల్లులు ఇతర చార్జీలు బాగాపెరుగుతాయన్న భయంతో మహిళలు కాంగ్రెస్‌కుకట్టకట్టుకుని ఓటు వేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ధనికులుమరింత ధనికులయ్యారు, పేదలు మరింత దిగజారిపోయారన్నసంకేతం ప్రజల హృదయాలను తాకింది. చంద్రబాబు నాయుడు చుట్టూచేరిన స్వార్ధ శక్తులు ఆయనను ఒక మాయాలోకంలో విహరించేలా చేశారు.ఎన్టీఆర్‌ హయాంలో పేదల సామాన్యుల పార్టీగా అవతరించినతెలుగుదేశం పార్టీకి ఇప్పుడా ఇమేజి పూర్తిగా పోయింది.

ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ మీద ప్రేమతో ఓట్లువేయలేదు. తెలుగుదేశం విధానాల మీద ఆగ్రహంతో ఓటు వేశారు.రేపు అధికారంలోకి రానున్న కాంగ్రెస్‌ మీద గురుతరబాధ్యత ఉంది. చేసిన వాగ్దానాలను వారు నిలబెట్టుకోవడం అంతతేలికకాదు.

గామీణ ప్రజలను పెద్దగా పట్టించుకోనిప్రభుత్వాలకు ఎన్నికల్లో షాక్‌ తగులుతుందని ఒకసారి, ప్రచారంఎక్కువైతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని ఒకసారి, అభివృద్ధిఅనేదానికి అసలు నిర్వచనాలు వేరే ఉంటాయి కాబట్టి ఆ ఎజెండావెనుకబడిన దేశాల్లో పనిచేయదని ఒకసారి టాక్‌ఆఫ్‌ టుడే ఫీచర్‌కింద ప్రచురించాం. అలాగే తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్నక్రమశిక్షణ రాహిత్యం గురించి, ప్రభుత్వ పెడధోరణుల గురించివ్యాసాలు ప్రచురించినప్పుడు మా ఎన్నారై పాఠకులు విమర్శించినసందర్భాలు కూడా ఉన్నాయి.

నిజం నిప్పులాంటిది కాబట్టి అది ఎప్పటికైనాబయటపడక మానదు. రాష్ట్ర వ్యాప్త యంత్రాంగం గల భారీపత్రికలు కొన్ని పరిమితులు, ఇబ్బందుల కారణంగా ఈ వాస్తవాలనుముందు నుంచీ బయటపెట్టలేకపోవచ్చు. సత్యనిష్ట మీడియాకిఉండాల్సిన ప్రధమ లక్షణం కాబట్టి ఆ విషయంలోరాజీపడకూడదని మా పద్ధతిలో మేం విశేష కథనాలుప్రచురిస్తూ వచ్చాం. ఈ మార్గంలో మా మీద పూలు, రాళ్ళుసమానంగా పడ్డాయి. ఒక ప్రభుత్వం పెడదారిలో వెళ్తున్నప్పుడు,దిగువతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆ విషయాన్నిపాఠకులకు విశ్లేషించి చెప్పడం బాధ్యతగా భావించాం. తెలంగాణవేర్పాటు వాదం గురించి రెండోదశ కోస్తా ఎన్నికల్లో ప్రస్తావించినా అదిపనిచేయదని, ప్రభుత్వ వ్యతిరేకత అంటూ జనంలో బయలుదేరితే ఈఅంశాలకు విలువ ఉండదని నెల రోజుల క్రితమే ప్రచురించాం. కోస్తాఆంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయనిఎగ్జిట్‌ పోల్స్‌కు రెండురోజుల ముందే ప్రధాన వార్తగా ప్రచురించినవిషయం తెలిసిందే.

ప్రతిరోజూ ఆయా పార్టీల నాయకుల ప్రకటనలుప్రసంగాలతో పేజీలు నింపడం వల్ల దూరతీరాల్లో ఉంటున్నతెలుగువారికి నిజానిజాల సాంధ్రత తెలియకుండా పోయి ఒకఅయోమయ పరిస్ధితి నెలకొంటుంది. అలా జరగకూడనే ఉద్దేశంతోవార్తలతో పాటు నిస్పాక్షిక విశ్లేషణలు ఇస్తూ వస్తున్నాం. మొత్తంగాప్రభుత్వ విధానాల వల్ల ఏ వర్గాలు నష్టపోయాయి, ఏ వర్గాలులాభపడ్డాయి అన్నది ఎప్పుడైనా నిగ్గుతేలాల్సిన విషయం.

అలాగని పనిగట్టుకుని విమర్శించడం , అదే పనిగాప్రశంసించడం మా విధానం కాదు. గత రెండేళ్ళ నుంచి రాష్ట్రరాజకీయ స్ధితిపై మేం ప్రచురించిన మీరు చదివినవిశేషకథనాలను దిగువ ఇస్తున్నాం.

అవి:

ఇటీవలికథనాలు

  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X