• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శుభాకాంక్షలు

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, June 21 2004

Praveenహైదరాబాద్‌: తెలుగమ్మాయి దివ్యవాషింగ్టన్‌లో హత్యకు గురి కావడంపై వాషింగ్టన్‌ పత్రికల్లోఅనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈకేసులో హంతకుడుభర్త ప్రవీణ్‌ అన్న కోణంలోనే పోలీసు దర్యాప్తు సాగుతోంది. అందుకువారు ప్రాధమిక సాక్ష్యాధారాలను కనుగొన్నారు.

గత ఏడాదిఅక్టోబరులో తన భార్య దివ్య తనను వేధిస్తున్నదంటూ ప్రవీణ్‌అక్కడి కుటుంబకోర్టులో ఫిర్యాదు చేసినట్టు ఇప్పుడు వెల్లడైంది.లాడోన్‌ జడ్జి దివ్య త న భర్తను వేధిస్తోందనడానికి తగినఆధారాలున్నాయంటూ ఆమెపై ఎమర్జెన్సీ ప్రొటెక్టివ్‌ ఆర్డర్‌జారీ చేశారు. ఈ ఆర్డరు ప్రవీణ్‌ ఈ కేసులో తక్కువ శిక్షతోబయటపడడానికి ఉపయోగపడవచ్చు. ప్రవీణ్‌ ముందుచూపుతోనేఈ ఆర్డరు సంపాదించాడా? ఎప్పటికైనా ఆమె ప్రాణాలు తీయాలనిముందునుంచే ప్లానుతో ఉన్నాడా?

లీస్‌బర్గ్‌లోని ఒక బ్యాంకులో పనిచేస్తున్న దివ్య మందనపు మంచి ఉద్యోగిగాపేరు తెచ్చుకుంది. గత వారం ఆమె చెప్పాపెట్టకుండా డ్యూటీకిడుమ్మా కొట్టడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందారు. తెలిసినఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేశారు. అయినా లాభం లేకపోయింది.

సరిగ్గా అదే సమయంలో ప్రవీణ్‌ బ్యాంకుకుకాల్‌ చేశాడు. వారాంతంలో దివ్య, తాను ఘర్షణ పడ్డామనిరెండు రోజుల వరకు తనతో మాట్లాడనని ఆమె కోపంగాచెప్పిందని, అప్పటి నుంచి ఆమె కన్పించడం లేదని ప్రవీణ్‌ బ్యాంకుఅధికారులకు చెప్పినట్టు కోర్టు రికార్డులలో ఉన్నట్టుతెలుస్తోంది.

విజయవాడకు చెందిన దివ్యహైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌తో ఐదేళ్ళ క్రితం పెళ్ళి జరిగింది.ఇద్దరూ ఐదేళ్ళ క్రితం అమెరికాలో స్ధిరపడ్డారు. ఎంబిఎ చదివినదివ్య బ్యాంకులో పనిచేస్తుండగా, ప్రవీణ్‌ కంప్యూటర్‌ సంస్ధలో ఉద్యోగి.భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవని రాష్ట్రంలోనివారి బంధువులే గాక దివ్య సహోద్యోగులు కూడా చెబుతున్నారు.

దివ్య కన్పించడం లేదని ప్రవీణ్‌అమాయకంగా బ్యాంకుకు ఫోన్‌ చేసినప్పటికీ తోటి ఉద్యోగులుఅనుమానంతో పోలీసు అధికారులకు పదహారో తేదీన ఫిర్యాదుచేశారు.

అదే సమయంలో ముక్కలు ముక్కలైనదివ్య శరీరభాగాలు ఒక సూట్‌కేసులో డస్ట్‌ బిన్‌ వద్దకన్పించాయి. మరికొద్ది గంటలకు ప్రవీణ్‌ తన గ్రీన్‌ హోండా కారులోఅపస్మారక స్ధితిలో కన్పించాడు. దారినపోయేవారు అతడిని ఆస్పత్రిలోచేర్చారు. అదే సమయంలో ప్రవీణ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్టుటెలివిజన్‌ ఛానళ్ళలో ఆయన ఫోటో రావడంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించిపోలీసులకు సమాచార ఇవ్వడంతో అతను అరెస్టయ్యాడు.

ఈకేసులో అనేక విషయాలు మిస్టరీగా ఉన్నాయి.

భార్య దివ్య తనను మానసికంగావేధిస్తోందంటూ గత ఏడాది ప్రవీణ్‌ కోర్టును ఆశ్రయించినట్టుతెలుస్తోంది. ఆ వివరాలేమిటి?

ప్రవీణ్‌ కారులో దగ్గుమందు నింపినబాటిళ్ళు లభించాయి. అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడా?

అంతకు ముందు ప్రవీణ్‌ తన బాస్‌కు ఫోన్‌చేసి తన భార్యతో ఘర్షణ జరిగినందువల్ల మానసికంగాఅప్‌సెట్‌ అయ్యానని, ఆఫీసుకు రాలేనని చెప్పాడు. భార్యను చంపేఉద్దేశం ఉన్నా, అప్పటికే చంపినా భార్యతో ఘర్షణ పడిన విషయాన్నిప్రవీణ్‌ ఎందుకు వెల్లడిస్తాడు? ఈ కేసులో ప్రవీణ్‌ అమాయకుడా?

దివ్య తల్లికి డబ్బు మీద వ్యామోహంఎక్కువని, మాటిమాటికీ డబ్బు పంపవలసిందిగా అమెరికాకుఫోన్లు చేసేదని ప్రవీణ్‌ తలిదండ్రులు అంటున్నారు.

ఘర్షణ జరిగినరోజే దివ్య బాయ్‌ ఫ్రెండ్‌తోవెళ్ళిపోయిందని ప్రస్తుతం మస్కట్‌లో ఉన్న ప్రవీణ్‌ తండ్రిచెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రవీణ్‌ అదేరోజు తనకు ఫోన్‌చేసిచెప్పాడని ఆయన కథనం.

దివ్య హత్యకు కారణాలేమిటో స్పష్టంకాలేదని పరిశోధన జరుగుతోందని అమెరికన్‌ అధికారులుచెబుతున్నారు.

ఇటీవలికథనాలు

 • చంద్రబాబుఅస్త్రాలు
 • ఎవరీ సిసి రెడ్డి?
 • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
 • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
 • వెలుగు వెనుక చీకటి
 • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
 • చుట్టాలు-చట్టాలు
 • ఈయన సినిమా పోలీసు కాదు
 • ప్రత్యూష కేసు మరో మలుపు
 • ప్రజల దేవుడు
 • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
 • రేపటి సంగతి
 • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X