• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదే తీరు!

By Staff
|
చంద్రబాబు ప్రభుత్వకార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి,పార్టీని పట్టించుకోలేదనే అభిప్రాయంకూడా వచ్చింది. ఇది సంపూర్ణ సత్యంకాదు. చంద్రబాబు ఒక వ్యూహంగానే అలావ్యవహరించారు. ప్రభుత్వానికి,పార్టీకి మధ్య అంతరాన్ని పూడ్చేసేప్రయత్నం చేశారు. తెలుగుదేశంపార్టీ కొంప మునగడంలో దీని పాత్ర ఉంది.పార్టీ, ప్రభుత్వాల మధ్య తేడానుచెరిపేసే ప్రయత్నం వల్లతెలుగుదేశం కార్యకర్తలు వివిధప్రభుత్వ కార్యక్రమాల ద్వారాగ్రామస్థాయి నుంచి లబ్ధి పొందారు.జన్మభూమి, పనికి ఆహారం పథకం,సాగునీటి సంఘాలు, డ్వాక్రాలు వంటి వాటిద్వారా తెలుగుదేశం కింది స్థాయినాయకత్వం ఆర్థికంగా కొంతమేరకు బలోపేతం అయింది. ఇవి మొత్తంప్రజానీకం ప్రయోజనాలకుఉపయోగపడలేదు. దీంతోతెలుగుదేశం నాయకత్వానికి,ప్రజలకు మధ్య అంతరం పెరిగింది.

తెలుగుదేశంపార్టీ ఓటమికి ప్రధాన కారణం - గ్రామీణప్రాంతాలను విస్మరించడం. వరుసకరువుతో, వర్షాభావంతో, అప్పులభారంతో, ఉపాధి కొరతతో, కరెంట్‌ఛార్జీల భారంతో గ్రామీణ ప్రాంతాలుశిథిలావస్థకు చేరుకున్నాయి. ఐటిద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామనేచంద్రబాబు మాటలు ఆచరణసాధ్యమవుతాయనే నమ్మకంఎక్కడా ఏర్పడలేదు. ఈ సందర్భంలోస్వీడన్‌ ప్రభుత్వాధినేత మాటలనుగుర్తు చేసుకోవడంఅంసదర్భమేమీ కాదు.

చంద్రబాబుమాటలు విన్న ఆయన - "ఇలామాట్లాడితే మా దేవంలోనైతేజైల్లోనైనా పెడతారు,పిచ్చాసుపత్రికైనా పంపిస్తారుఅన్నారు. హైదరాబాద్‌ను వరదలుముంచేసినప్పుడు ప్రముఖ కార్టూనిస్టుఆర్‌.కె. లక్ష్మణ్‌ చంద్రబాబుపై ఒకకార్టూన్‌ వేశారు. కంప్యూటర్‌ముందు కూర్చున్న ప్రభుత్వాధికారిచంద్రబాబుతో ఇలా అంటారు - "దివాటర్‌ ఈజ్‌ అవుట్‌ సైడ్‌ సర్‌! వుయ్‌ కెనాట్‌ డిలిట్‌ ఇట్‌ ఆ కార్టూన్‌లో. ప్రజలుస్వేచ్ఛగా తమ సమస్యలు వినిపించాలనిచంద్రబాబు తాను ముఖ్యమంత్రిగావున్నప్పుడు ఒకానొక బహిరంగసభలో చెప్పారు.

ఆ మాటలను నమ్మి ఒకమహిళ మాట్లాడటం మొదలు పెట్టింది.దానికి చిరాకెత్తిన చంద్రబాబు"ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలోనేర్చుకో అని హెచ్చరించారు. ఇదంతాఎందుకంటే ఆయన తన హయాంలోప్రజల మనోభావాలను కనిపెట్టి వాటికిఅనుగుణంగా వ్యవహరించడానికిఏనాడూ ప్రయత్నం చేయలేదనిచెప్పడానికే.

అలిపిరిలోనక్సలైట్లు దాడి చేసిన తర్వాతతాను మారిన మనిషినని చంద్రబాబుప్రకటించుకున్నారు. ఆ మార్పుకోసం ప్రజలు ఆశగానే చూశారు. కానీఆయన తీరు మారలేదు. మొత్తంగాఆయన వ్యవహారశైలి అంతా తానుచేసింది కరెక్టు, తాను ఏది చెప్తే అదికరెక్టు, అందరూ దీన్ని అంగీకరించాలి అనేపద్ధతిలో సాగింది. అలాఅంగీకరింపజేయడానికి ఆయనమైండ్‌సెట్‌ గురించి మాట్లాడారు.

అయితేచదువుకున్న మధ్యతరగతిమనస్తత్వాలను ఆయన కొంతతనకు అనుకూలంగామార్చుకోలిగారే గానీ అత్యధిక గ్రామీణప్రజల, సామాజిక వర్గాలనుమార్చుకోలేకపోయారు. దీని వల్లఆయన చేసే పనులను, ఆయన చెప్పేమాటలను చూసి, విని చప్పట్లు కొట్టడమేచేయాల్సిన పనిగా మిగిలింది. ఇష్టంలేకపోతే నోరు మూసుకుని పక్కకుజరిగే పద్ధతి ఆచరణలోకి వచ్చింది.

తెలుగుదేశంపార్టీ ఓటమికి చంద్రబాబు తప్పమరొకరు కారణం కాదనినిర్ద్వంద్వంగానే చెప్పవచ్చు.ఎందుకంటే ఆయన సమిష్టినాయకత్వాన్ని ఎప్పుడూప్రోత్సహించలేదు. అందరి అభిప్రాయాలుతీసుకున్నట్లు కనిపిస్తూనే తననిర్ణయాలనే అమలు చేశారు. తనకుతిరుగు ఉండకూడదనే పద్ధతిలోవ్యవహరించారు. అందువల్ల భజనబృందాలు ఏర్పడినా, చెమ్చాగిరీలు సాగినా,వెన్నుపోట్లు జరిగినా, సమన్వయ లోపం చోటుచేసుకున్నా - అన్నింటికీ ఆయనేకారణం.

గ్రామీణప్రాంతాలను విస్మరిస్తే ప్రస్తుతకాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా ఇదే గతిపడుతుంది. ఇందులో ఒకరుసంతోషించడానికి, మరొకరు విచారపడడానికి ఏమీ లేదు. రాజకీయసమరంలో ప్రజలను పట్టించుకోవడంఅన్నింటికన్నా ముఖ్యమైనదనేదిపార్టీలు, వాటిని నడుపుతున్ననాయకులు గుర్తించాల్సిన అవసరంఉంది.

ఇటీవలికథనాలు

  • బాబుకు ఇక కోర్టు కేసులు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?
  • అస్పష్ట రాజకీయ చిత్రం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more