లెఫ్టే రైటా?

Chandrababu Naiduహైదరాబాద్‌:రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతమరోసారి నిజమయ్యే అవకాశముంది.బిజెపి హిందుత్వ బాటలో పయనించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదేశంఅధినాయకుడు చంద్రబాబు నాయుడుపాతమిత్రులైన లెఫ్ట్‌పార్టీలతోతగిన సమయంలో చెలిమి చేయాలనుకుంటున్నారు.

కేంద్రంలో బిజెపినాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరమని వాజ్‌పేయి ఎన్నిసార్లు కోరినాచంద్రబాబు నాయుడు అంగీకరించలేదు.బిజెపి విధానాలతో తమకు సంబంధంలేదని, తాము వెలుపలి నుంచి మద్దతుఇస్తామని ఆయనఅనేకసార్లు స్పష్టం చేశారు. అద్వానీ నాయకత్వంలోని బిజెపి ఇటీవలహార్డ్‌కోర్‌ హిందుత్వ లైన్‌ తీసుకోవడంతోచంద్రబాబు నాయుడు ఆ పార్టీతో తెగతెంపులుచేసుకోవాలనిసీరియస్‌గా ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలోకార్యకర్తల బలం పరంగా చూస్తే బిజెపికంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలదే పైచేయి అన్నవాస్తవం చంద్రబాబు నాయుడికి తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మీద పోరాటం చేయడానికివామపక్షాలను కలుపుకొని పోతే మంచిఫలితాలు వస్తాయని ఆయన భావిస్తున్నారు.చంద్రబాబు నాయుడు పంపిన మేఘసందేశం లెఫ్ట్‌ పార్టీలకు చేరడం, అవికూడా తమ పాత నేస్తానికి అనుకూలంగా సంకేతాలు పంపడంజరిగిపోయాయి.

వామపక్షాలతోచెలిమి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబునాయుడు ప్రకటిస్తే చర్చలు జరపడానికి తాముసిద్ధంగా ఉన్నామనిసిపిఐ రాష్ట్ర శాఖకార్యదర్శిసురవరంసుధాకరరెడ్డి ప్రకటించడంగమనార్హం. టిడిపి ప్రపంచ బ్యాంకుఅనుకూల విధానాలను తీవ్రంగావ్యతిరేకించిన వామపక్షాలు చంద్రబాబునాయుడిని గద్దె దింపడానికిగత వఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్లసర్దుబాటు చేసుకున్నాయి. ఇప్పుడుకాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చంద్రబాబువిధానాలనే అనుసరించడంవామపక్షాలకు రుచించడం లేదు. చంద్రబాబు తమదారిలోకి వస్తేటిడిపితో చెలిమి సాధ్యమేననివామపక్షాలు భావిస్తున్నాయి.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

ఇటీవలికథనాలు

  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+