తెలంగాణకు ఎర్ర జెండా

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, July 31 2004

హైదరాబాద్‌: మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు మిత్రపక్షాలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్న సిపిఎం శనివారం మరో అడుగు ముందుకేసింది. సమన్వయ కమిటీ గురించి సోనియాగాంధీతో శనివారం చర్చించిన సిపిఎం అగ్ర నాయకుడు జ్యోతిబసు తమ పార్టీ తరఫున ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపారు.

యుపిఎ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న సిపిఎం ఆర్ధిక సంస్కరణల విషయంలో మన్మోహన్‌ ప్రభుత్వానికి పగ్గాలు వేయాలనుకుంటున్నది. డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో కూడా తమ మాట వినాలన్నది సిపిఎం అభిమతంగా కన్పిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఒక ముఖ్యమైన అంశాన్ని సిపిఎం ప్రభావితం చేయబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం కొత్తగా ఏర్పాటు కానున్న సమన్వయ కమిటీ ద్వారా కేంద్రప్రభుత్వానికి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పదలచుకుంది.

సమన్వయ కమిటీలో సిపిఎం ప్రతినిధులుగా బర్దన్‌, సీతారాం ఏచూరి తదితర ఆరుగురు సభ్యులు ఉంటారు. యుపిఎ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగాలన్నది తమ అభిమతమని, అందువల్ల సమన్వయ సంఘం అవసరమని సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు.

Recent Stories
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+