• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక టిడిపి నేతవిజయ గాధ

By Staff
|

హైదరాబాద్‌:గత అసెంబ్లీ ఎన్నికల ముందు చిరంజీవినిఅడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడి వద్దడ్రామాలు ఆడిన టిడిపి పోలిట్‌బ్యూరోసభ్యుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లుకు ఇప్పుడు బాబు దర్శనంకష్టమవుతోంది. కాలేజిలెక్చరర్‌గా జీవితం ప్రారంభించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆలస్యంగాతెలుగుదేశం పార్టీలో చేరినా చంద్రబాబు నాయుడుహయాంలో ప్రముఖ నాయకుడుగా ఎదిగారు. పవిత్రమైనఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన ఈయనదిరాజకీయాల్లో మొదటి అధ్యాయం నుంచిఇప్పటి వరకు అవినీతి ఆరోపణల మయమే.చంద్రబాబు రాజకీయ జీవితంపై పొగడ్తలతో అందమైనపుస్తకంరాసిన ఈ అతితెలివి అధ్యాపకుడుకొంతకాలం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖసహాయ మంత్రిగా పనిచేసినప్పుడు తీవ్రమైనఅవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

పాక్షిక రాజకీయచిత్రం ఇంద్ర హిట్‌ అయిన తర్వాతచిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్నవార్తలువచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు ప్రాధాన్యతటిడిపిలో పెరిగింది. చిరంజీవి, ఈయన ఒకే సామాజిక వర్గానికిచెందిన వారుకావడంతో రాజకీయాల్లోకి రాకుండా చిరంజీవిని ఒప్పించవలసిందిగాచంద్రబాబు నాయుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లును రంగంలోకిదింపారు. తనకు ముఖ్యమైనపనులను చంద్రబాబు నాయుడుఅప్పగించినప్పుడల్లా కోట్లలో డబ్బు వచ్చేకాంట్రాక్టులను అడిగే ఉమ్మారెడ్డికాంట్రాక్టర్‌ అయిన తన కుమారుడికి పెద్ద ఫేవర్‌చేయించుకున్నట్టు పత్రికలు రాశాయి.అమీర్‌పేటలో హుడా కాంప్లెక్స్‌ పక్కనవెలసిన హుడా స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌కాంట్రాక్టర్‌ ఉమ్మారెడ్డి సుపుత్రుడే.రాజకీయాల్లోకి రాకుండా చిరంజీవినిఒప్పించానని, ఒకవేళ వచ్చినా టిడిపికి చిరుమద్దతు ఉండేలా ఏర్పాటు చేశానని చంద్రబాబునాయుడికి చెప్పడమే గాకవారిద్దరి మధ్య రహస్య సమావేశానికి ఏర్పాటుచేసింది ఈ పెద్ద మనిషే.

ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు వెనక ఆయన సామాజినవర్గానికిచెందిన వారంతాఉన్నారని, వారంతా ఈయనను చూసితెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని చంద్రబాబునాయుడు గాలిలో కట్టిన మేడలు ఎన్నికల ఫలితాల రోజునకూలిపోయాయి. తనకు రాజకీయాల్లోకివచ్చే ఉద్దేశం లేదని, సామాజికసేవలోనే తనకు ఆనందం ఉందని చిరంజీవిచెబుతున్నా ఆయన ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తారని ప్రచారం చేసి చంద్రబాబునాయుడిని తనచెప్పుచేతల్లో పెట్టుకున్న ఘనత ఉమ్మారెడ్డిది. ఈ పెద్దమనిషి ఇలా చేస్తున్నాడని, తమకు ప్రాధాన్యంలేకుండా అడ్డుకుంటున్నాడని ఆగ్రహించినఅదే సామాజిక వర్గానికి చెందినతూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకుచెందిన టిడిపి నాయకులు గతఎన్నికల్లో హృదయ పూర్వకంగా టిడిపివిజయానికి కృషి చేయలేదు.కాంగ్రెస్‌లోని అదే సామాజిక వర్గానికి చెందిననాయకులు వైఎస్‌ కోసం,కాంగ్రెస్‌ విజయం కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడారు.

ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు ప్రస్తుతం రోజూతెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కర్రఊతంగా వస్తున్నప్పటికీ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. చంద్రబాబునాయుడు హయాంలో పనికి ఆహారంబియ్యం బ్లాక్‌లో అమ్ముకునిలక్షాధికారులైన చోటా నాయకులు చీమలవంటి వారైతే మిగితా పనులు చేయించుకుని ఏనుగుల్లామారిన వారు ఉమ్మారెడ్డి వంటి నాయకులు. ప్రకృతిఎప్పటికప్పుడు తనను తాను ఎలా బ్యాలెన్సుచేసుకుంటుందో ప్రజాస్వామ్యం కూడా అంతే. ఒకొక్క సీజన్‌ఒకొక్కరిది.

ఈ పేజీని మీమిత్రులకు పంపండి

రాంగోపాల్‌వర్మనాచ్‌ వివాదం

హెల్మెట్‌లోదాగిన అవినీతి పురుగు

మన్మోహన్‌హంగ్‌!

రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు

షిండే సక్సెస్‌ స్టోరీ

ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!

ఉదయభాను విషాదగాధ

ఉత్తమ కంపెనీల్లో సత్యం

హిందీలోవీరప్పన్‌ సినిమా

అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్‌

దసరామూవీస్‌

రెండోరౌండు సాధ్యమే!

కెసిఆర్‌మీమాంస

లంచగొండితనంసమస్య కాదా?

నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌

ఇకనైనా నిదానం నాగేందర్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more