వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదా రాజీ ఫార్ములా?హవ్వ!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 05-07-2005

ఇదా రాజీ ఫార్ములా?హవ్వ!

Digvijay Singhహైదరాబాద్‌:శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టినట్టుగా ఉంది కాంగ్రెస్‌అధిష్టానవర్గం వైఖరి తెలంగాణపై.ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి తిరిగివచ్చాక ఆయనకు, టిఆర్‌ఎస్‌అధినేత చంద్రశేఖరరావుకుమధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామనికాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌హామీ ఇవ్వడం కేవలం కాలహరణ కోసమే. ఈ లోపు తెలంగాణ ఏ ఏరంగాల్లో వెనుకబడి ఉందో ఒక నివేదికఇవ్వమని దిగ్విజయ్‌ సింగ్‌ చంద్రశేఖరరావును కోరడంకూడాఅటువంటిదే.

దూరంగాఢిల్లీలో ఉండే అధిష్టానవర్గానికికాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కలిసి ఉండాలనేఆకాంక్ష ఉంటుంది. గత ఎన్నికల్లో కలిసి పోటీచేశారు కాబట్టి కలిసి ఉండాలన్నసెంటిమెంట్‌ అధిష్టానవర్గానిది. కానీఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీనిఓడించాలనే లక్ష్యంతో రెండు పార్టీలుకలిశాయి కానీ ఉభయ పార్టీల దారులు వేరు.ఎక్కడైనా బావ గానీ తెలంగాణ రాష్ట్రంఏర్పాటు విషయంలో కాదన్నట్టు ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్నారు.

వైఎస్‌రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజాబలం గల నాయకుడని కాంగ్రెస్‌ అధిష్టానవర్గంఅభిప్రాయం. ఇది పూర్తిగా వాస్తవం కాదు. చంద్రబాబునాయుడి మీద వ్యతిరేకతవల్ల అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాన్నిప్రజలు ఎంచుకున్నారు కానీ వైఎస్‌ ప్రజా నాయకుడు కాదు. ఈవిషయాన్నిఅధిష్టానవర్గం గుర్తించే అవకాశంలేదు. మరో విషయం ఏమిటంటేఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌ తెలంగాణలోపెద్ద శక్తి కాదు. ఇక ముందుబలపడవచ్చు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో పెద్ద శక్తి కాంగ్రెసే. ఇప్పటికిప్పుడుతెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రిఅయ్యేది కాంగ్రెస్‌ అభ్యర్దే.ఇది అంత సంక్లిష్టమైన వ్యవహారం.

ఈనేపధ్యంలో వైఎస్‌, చంద్రశేఖరరావు మధ్యచర్చలుఏవిధమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి?తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్‌,కెసిఆర్‌లది పరస్పర విరుద్ధమైనవైఖరి. వైఎస్‌ పుల్ల విరిచినట్టు మాట్లాడుతారు. కెసిఆర్‌బల్లగుద్దినట్టు మాట్లాడుతారు. వీరిద్దరి మధ్యచర్చలుఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా?ఇదంతా ఒక మహాసముద్రం వంటికాంగ్రెస్‌ పార్టీ అవగాహన లోపం. అటూ ఇటూ తిరిగితెలంగాణ వ్యవహారం రెండో ఎసార్సీఏర్పాటుతో తాత్కాలికంగా ముగియవచ్చు. చంద్రశేఖరరావుకూడా ఏదో ఒకటి సాధించినట్టు తెలంగాణ ప్రజలకుచూపించికేంద్ర మంత్రిగా కొనసాగడానికే మొగ్గుచూపుతారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X