ఇండియాఇన్ఫోకు ఐఎస్‌ఒ 9001

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 20-01-2006

హైదరాబాద్‌: పేదరాసి పెద్దమ్మ కథలను వారు చదివి ఉండకపోవచ్చు. అయినా వారు పెద్దమ్మలుగా మారిపోయి వంటలు చేసి పెడుతూ తమ తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. హెచ్‌వన్‌-బి వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న టెకీల భార్యలు తమ తీరిక సమయాన్ని టీవీలకు వెచ్చించకుండా స్వగృహ ఫుడ్స్‌ను సరఫరా చేసి వేణ్ణీళ్ళకు చన్నీళ్ళుగా (డాలర్లకు మినీ డాలర్లుగా) సంపాదించే ట్రెండ్‌ విస్తరిస్తున్నట్టు ఒక ఆంగ్ల పత్రికలో ఒక ఫీచర్‌ ప్రచురితమైంది. హెచ్‌-4 వీసాల మీద అమెరికా వెళ్ళిన గృహిణులు ఎంత క్వాలిఫైడ్‌ అయినా అక్కడ ఉద్యోగం చేయడానికి ప్రభుత్వ అనుమతి ఉండదు. కాబట్టి భర్తలు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కష్టపడుతుంటే, భార్యలు వంటలు చేసి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. ఆంధ్రా వంటకాలు అంటూ సులేఖాడాట్‌కామ్‌ వంటి సైట్లలో రోజుకు పది కొత్త యాడ్స్‌ కన్పిస్తున్నాయి.

మూడేళ్ళ క్రితం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్ళి గృహిణిగా స్ధిరపడిన ఉష అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన భర్త సంపాదించే దానిలో మూడో వంతు ఇంట్లోనే వంటలు చేసి సంపాదించడం విశేషం. ఈమె ఇండియాలో ఉండగా ఇంజినీరుగా పనిచేసింది. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా ఇతరులకు వండి పెట్టడం పెద్ద శ్రమ కాదని ఆమె అంటోంది. యాభై అరవై మంది వచ్చే పార్టీలకు ఆమె ఆహారం సరఫరా చేస్తుంటారు. ఒక పౌండు శాఖాహార కూరను సుమారు ఐదు డాలర్లకు అమ్ముతున్నారు. రుచికరంగా ఉంటాయని పేరు వస్తే ఇంకా కొంచె ఎక్కువ రేట్లు పెట్టినా కొనుక్కు వెళ్ళే వారికి కొదవలేదు. నాన్‌ వెజ్‌ కూరలకు పౌండుకు ఆరు నుంచి పది డాలర్లు చార్జి చేస్తున్నారు.

ఏటా అమెరికాకు దాదాపు 25 వేల మంది భారతీయ టెకీలు వెళ్తుంటారు. వారిలో ఎక్కువ మందికి వంట రాదు. బయట రెస్టారెంట్లలో ఫుడ్‌ చాలా ఖరీదు అవుతుంది. అందువల్ల వంట నేర్చుకోవడమో, లేదంటే తోటి ఎన్నారై కుటుంబాల నుంచి అవుట్‌ సోర్సింగ్‌ చేసుకోవడమో తప్పనిసరి. అందువల్ల ఆమెరికాలోని భారతీయుల ఇళ్ళల్లో స్వగృహ ఫుడ్స్‌ కు డిమాండ్‌ పెరుగుతోంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+