వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుకకు హద్దులుండవా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 11-08-2005

హైదరాబాద్‌:మీడియా హద్దులు మీరడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిఅసహనంగా ఉన్నారు. మీడియాలో ఒక భాగంతమకు వ్యతిరేకంగా అదే పనిగా దుష్ప్రచారానికిదిగుతూవస్తోందనిఆయన అభిప్రాయ పడుతున్నారు. ఇటీవలవోక్స్‌వ్యాగన్‌ ఉదంతంలో ఒక వర్గంమీడియా ఓవర్‌యాక్షన్‌ చేసిన మాటవాస్తవమే. వోక్స్‌వ్యాగన్‌ ప్రతినిధిహైదరాబాద్‌ వచ్చి ప్రభుత్వానికివివరణ ఇచ్చుకోవడంతో ఆ పత్రికలుపుంఖానుపుంఖానులుగా రాసిన వార్తా కథనాలువిశ్వసనీయత కోల్పోయాయి.

పరిటాల రవిహత్యకేసులో ప్రధాన షూటర్‌గా అనుమానిస్తున్నమొద్దు సీను అలియాస్‌జూలకంటి శ్రీనివాసరెడ్డిని ఒక టీవీ ఛానల్‌ఇంటర్వ్యూ చేసింది. మరో నలుగురినిహత్య చేసిన తర్వాతే తానులొంగిపోతానని మొద్దు సీను ఆ పవిత్రఇంటర్వ్యూలో డిక్లేర్‌ చేశాడు. ఒక నాయకుడిని హత్యచేసింది తానేననిడిక్లేర్‌ చేసిన వ్యక్తిని చట్టానికిఅప్పగించాల్సిన బాధ్యత ఆ ఛానల్‌ప్రతినిధికి ఉంటుందా ఉండదా అన్నది చర్చనీయాంశం.నైతికంగా ఆలోచిస్తేఅటువంటి వ్యక్తులకు ఇంటర్వ్యూల ద్వారాప్రచారం కల్పించడం తప్పిదమే.అప్పటి నుంచి మొద్దు సీను చట్టానికి దొరకకుండా సవాలుగామారాడు. ఆ టీవీఛానల్‌ వ్యవహారాన్ని ముఖ్యమంత్రిగురువారం పరోక్షంగా తప్పుబట్టారు. చట్టానిఎవరూ ఎక్కువ కాలంతప్పించుకుని బతకలేరని, ఆ టీవీఛానల్‌ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోందనిముఖ్యమంత్రి అన్నారు.

ఇటీవలమీడియా ప్రతినిధుల ధోరణి విపరీతంగాఉంటోంది. తాము లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌లకంటే ఎక్కువన్నట్టు వారు వ్యవహరిస్తున్నారు.చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమన్న సత్యాన్నివారు సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారు. రాజకీయనాయకులుతమ ప్రచారం కోసం టీవీ ఛానళ్ళనుఆశ్రయించవచ్చు. అంత మాత్రం చేతతామే సర్వసం అన్నట్టు మీడియావ్యవహరించడం తగదు.మెరుగైన సమాజం కోసం కృషి చేయాల్సినమీడియా ప్రతినిధులు తమమెరుగైన జీవనం కోసంతపించడం, అడ్డదారులు తొక్కడంసమంజసం కాదు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X