మంచి కొంచెమే
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ 05-04-2005
హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి దాదాపుసంవత్సరం కావస్తోంది. శ్లాబ్‌సిస్టం తొలగించి సినిమా పరిశ్రమకు కొంతమేలు చేయడం మినహా వైఎస్‌రాజశేఖరరెడ్డి చెప్పుకోదగిన విజయాలు సాధించలేదనేచెప్పాలి. 4,000 కోట్లతో 26ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించనున్నట్టుఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం టెండర్ల కేటాయింపులో తీవ్రఅవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి సర్వేఇంకా పూర్తి కాలేదు. వైఎస్ ప్రభుత్వాన్నిఅప్రతిష్ట పాలు చేసిన మరో రంగంఎక్సైజ్. మద్యం దుకాణాల సంఖ్యనుపెంచుతూ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎక్సైజ్ విధానంకోర్టుల,మహిళా సంఘాల ఆక్షేపణకు గురైంది.కొత్త షాపుల యజమానుల నుంచిప్రభుత్వం డిపాజిట్‌గా సేకరించిన 2800 కోట్లుబ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఎక్సైజ్‌విధానంపై హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పునుసుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ప్రభుత్వానికిధైర్యం చాలడం లేదు. అంతా గంద్రగోళంగాఉందని ఎక్సైజ్ కమిషనర్ మీనా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఉచితవిద్యుత్‌కు సంబంధించిన మార్గదర్శకసూత్రాలను ఇంకా రూపొందించలేదు. నక్సలైట్లతో శాంతిచర్చలు ప్రారంభించి మంచి పేరుతెచ్చుకున్న వైఎస్ ప్రభుత్వంఇప్పుడు చర్చలు విఫలం కావడంతోఅంతకు రెట్టింపు అప్రతిష్టనుతెచ్చుకుంది. వైఎస్ కంటే బాబే నయమనిమావోయిస్టు ప్రతినిధులుఅంటున్నారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మరో వైపు తెలంగాణసమస్య పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుపై మిత్రపక్షాలైన కాంగ్రెస్,టిఆర్‌ఎస్‌లు భిన్న ప్రకటనలు చేస్తూప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి.అన్నిటి కంటే ముఖ్యంగా గమనించాల్సిందివైఎస్ అసహనాన్ని. ఆయన అనుకున్నది చేసేమొండి మనిషి. అయితే ఆయనసంకల్పం ప్రజల శ్రేయస్సు కోసమైతేఫర్వాలేదు. కానీ అస్మదీయులకు మేలు చేకూర్చడానికి ఆయన అడ్డంగానిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావుఇస్తోంది.ఆయన నియమించుకున్న సలహాదారులునిర్మాణాత్మక సేవలు చేస్తున్నట్టు కన్పించదు.మంత్రులలో ఇద్దరు ముగ్గురు మినహాసమర్ధులు కరువయ్యారు. మంత్రివర్గవిస్తరణ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది.
చంద్రబాబునాయుడు ఒంటి చేత్తో, అయోమయం లేని పాలన అందించినా, ఆస్వేచ్ఛ నిరంకుశత్వానికి దారితీసింది.ప్రజాధనం పక్కదారి పట్టించారన్నప్రధాన ఆరోపణను ఆయనఎదుర్కొన్నారు. వైఎస్ హయాంలో కూడాఅటువంటి అపశృతులు లేకపోలేదు. అయితేపాలనలో అయోమయాన్ని ప్రజలుసహించరు. ఆ ఆయోమయం ముద్రవైఎస్ ప్రభుత్వంపై పడింది. నిజాలురాస్తున్న మీడియా మీద ఆయనఅసహనం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏకాంగ్రెస్ ముఖ్యమంత్రికీ లేనంత స్వేచ్ఛ వైఎస్‌కు ఉంది.మంత్రులనుఆయన ఇష్టం మేరకే ఎంచుకున్నారు. నాఅనుకున్న వారికే ఆయన నామినేటెడ్‌పదవులు పంచుకున్నారు. ఇంతటి స్వేచ్ఛను ఆయనసద్వినియోగం చేసుకుని మానవత్వం,విలువలు ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటేమంచిది.
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్ ప్లస్ పవర్
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
వైఎస్ అసహనం
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి












Click it and Unblock the Notifications
