చిరు పార్టీలో పొగలు, సెగలు

చిరంజీవిని డిఫెన్స్ లో పడేయడానికి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల చిరంజీవి ఉక్రోషానికి లేనవుతున్నారు. కానీ ఆయన ఈ సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండవచ్చు. అయితే ఆ సందేశం ప్రజల్లోకి శక్తిమంతంగా వెళ్ళలేదు.
చిరంజీవి పార్టీలో అప్పుడే అసమ్మతి పొగలు కమ్ముకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని, మొదటి నుంచి ఎన్నో త్యాగాలు చేసిన అభిమాన సంఘాల నాయకులకు మొండి చెయ్యి చూపారని అంతర్గతంగా అసంతృప్తి కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన తమ్మినేని సీతారాంను అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా నియమించడంపై అసంతృప్తి ఉంది.
ఒక మంచి మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పుకుంటున్న చిరంజీవి చిత్తశుద్ధిగా ఆ మార్పు కోసం ప్రయత్నిస్తే ఈ ఎన్నికల్లో కాకపోయినా ఐదేళ్ళ తర్వాత అయినా జనం బ్రహ్మరథం పట్టే అవకాశాలున్నాయి. మార్పు తేవాలన్న తపన ఉన్న నాయకులు ముందు తమ చుట్టూ ఉన్న వాటిని మార్చుకోవాలి.












Click it and Unblock the Notifications