పట్టు బిగిస్తున్న బాలకృష్ణ

Balakrishna
హైదరాబాద్: తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని చాలా కాలం దూరంగా ఉంచిన జాగ్రత్త పరుడు చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడికి ఇప్పుడు బాలకృష్ణ, హరికృష్ణల నుంచి చికాకులు ఎదురయ్యే పరిస్ధితులు నెలకొన్నాయి. గతంలో వివిధ కారణాల వల్ల దూరమైన వారిని తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేలా బాలకృష్ణ కృషి చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన సఫలమవుతున్నారు కూడా. ఎమ్మెల్యేలు గాలి ముద్దు కృష్ణమనాయుడు, కొమ్మి లక్ష్మయ్య నాయుడు తిరిగి తెలుగుదేశంలో చేరాలా చేయడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. వారికిప్పుడు చంద్రబాబు కంటే బాలకృష్ణే ముఖ్యం. బాలయ్య తెలుగుదేశం పార్టీలో ప్రధాన పవర్ సెంటర్ అవుతున్నారు. బాలయ్య అభిమానులు కూడా ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చూడాలనుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఊహించనిది కాకపోయినా ఇంత త్వరగా పరిస్ధితులు ఇలా పరిణమిస్తాయని ఆయన ఊహించి ఉండరు.

బాలకృష్ణ వియ్యంకుడైనందువల్ల, ఆడపిల్ల తండ్రిగా ఆయన తనకు ఏకు మేకు అయ్యే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ పరిస్ధితులు క్రమంగా చేతులు దాటిపోయే అవకాశం లేకపోలేదు. గుంటూరు సభలో తన ప్రసంగం సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి బాలకృష్ణలో నాయకుడు నిద్ర లేచినట్టు కన్పిస్తోంది. చంద్రగిరి టికెట్ ను రోజాకు ఇవ్వాలని బాబు అనుకుంటుండగా, నారా రామ్మూర్తి నాయుడికి ఇప్పించాలని బాలయ్య భావిస్తున్నారు.

బాలకృష్ణకు తన తండ్రికి ఉన్నంత ఆవేశం, పట్టుదల ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన వెనక్కి పోయే రకం కాదు. హరికృష్ణ అయినా కుటుంబ సమైక్యతను ఆశించి చంద్రబాబు సర్దుకుపోవచ్చు కానీ బాలయ్య అలా కాదు. అదీ కాకుండా ఒక బలమైన కులం ఆయనను ముఖ్యమంత్రి చూడాలని ఆశిస్తోంది. ఆ కుల పెద్దలు ఈ దిశగా పావులు కదపడానికి డిన్నర్ మీటింగులు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ ఇప్పటికే పార్టీ సంస్ధాగత అంశాలపై పట్టు సాధించగా, ప్రధాన ప్రచారకుడిగా బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడిని అవసరమైతే జాతీయ రాజకీ యాల్లోకి పంపించి, బాలయ్యకు ఇక్కడ పట్టాబిషేకం చేయడానికి కులపెద్దలు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య స్పష్టంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+