చిరంజీవి లోపాలు ఇవిbrకాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆయనను 'చిరు'గా ఎందుకు...?

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవిని పరిణతి చెందిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. నిన్న ఆయన ఏకంగా మూడు ప్రధాన పత్రికలకు ఒకే రోజు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం దీనికి సంకేతం. ఆయన ఇప్పటికీ ఒక పెద్ద హీరోలా మాట్లాడడం, రాజకీయ నాయకుడిలా వ్యవహరించకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

బీసీలకు ప్రాధాన్యం, తెలంగాణ రాష్ట్రం, అవినీతి వంటి ప్రధానాంశాలపై చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ ఇప్పటివరకు ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకోలేదు. చిరంజీవి ఎంత వరకు ఈ అంశాలపై సౌమ్యంగా మాట్లాడుతున్నారే తప్ప గట్టిగా మాట్లాడకపోవడం సామాన్య ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తోంది. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ( గొతు పెంచి ఆరోపణలు చేయడం) చిరంజీవిలో లేదని గ్రహించిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు పండుగ చేసుకుంటున్నారు.

చిరంజీవి తరహా కొత్త రాజకీయాలకు ప్రజలు ఆహ్వానం పలికితే మంచిదే. లేకపోతే ఈ ప్రయోగం విఫలమవుతుంది. ఇక మీదట కొత్త మొహాలు రాజకీయాల్లోకి రాకుండా పోతారు. ఇది మంచి పరిణామం కాదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో విసిగిపోయిన సామాన్య ప్రజానీకానికి ఇప్పుడు చిరంజీవి పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ చిరంజీవి కూడా తన సినిమా కెరియర్ లో చేసినట్టు అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇస్తే ఆయన ప్రజారాజ్యం "స్టాలిన్" సినిమాలాగా అట్టర్ ఫ్లాఫ్ అవుతుందనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్ధను రద్దు చేస్తానని ప్రకటించారు. దానితో తెలంగాణ ఓటర్లు గణనీయ సంఖ్యలో ప్రతిస్పందించారు. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండడానికి అదే ప్రధాన కారణం. అటువంటి విప్లవాత్మక ప్రతిపాదనలను చిరంజీవి ప్రతిపాదించడం లేదు.

చిరంజీవి ఇంకా సినిమా ఫక్కీలో వ్యవహరిస్తున్నారు. ఆయన సున్నితంగా ఉండడంతో రోజు రోజుకీ విమర్శలు పెరుగుతున్నాయి. ఆయన డిఫెన్స్ లో పడి ప్రతి విమర్శకు సమాధానం చెప్పుకోవలసి రావడం ఆయన అభిమానులకు రుచించడం లేదు. చిరంజీవి శిబిరంలో ఉత్సాహం నానాటికీ క్షీణించడం దేనికి సంకేతమో అర్ధం కావడం లేదు. చిరంజీవి త్వరగా రోడ్ల మీద పడి సామాన్య ప్రజలతో మమేకమై, ఎన్టీఆర్ తరహాలో కొత్త రాజకీయాలకు నాంది పలకాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+