సత్యంలో చంద్రబాబుకూ వాటా?

రామలింగరాజు కొడుకుల కంపెనీ అయిన మేటాస్ కు దాదాపు 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను అప్పగించిన వైఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇబ్బందిలో పడింది. ఈ నేపధ్యంలో కేసును సిబీఐకి అప్పగించి తాము నిరపరాధులమని చెప్పుకోవాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. రామలింగరాజుకు చంద్రబాబు, వైఎస్ ఫేవర్లు చేసినా చంద్రబాబుకు సత్యంతో ఉన్న అనుబంధంపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సత్యంలో షేర్లు లేవని టిడిపి రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి వివరణ ఇచ్చుకోవలసివచ్చిందంటే మర్మాన్ని అర్ధం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేయడానికే రామలింగరాజుకు ప్రోత్సాహం ఇచ్చామని అంతే కానీ, మేటాస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తాము ఎన్నడూ ఫేవర్ చేయలేదని చంద్రబాబు నాయుడు ముక్తసరిగా ఒక ప్రకటన చేశారు. ఏమైనప్పటికీ వ్యాపారానికి, రాజకీయాలకు ఉన్న సంబంధం సత్యం రామలింగరాజు వ్యవహారం ద్వారా ప్రజలకు స్పష్టమైంది.












Click it and Unblock the Notifications