చిరుకు భారీ ప్రశ్న!

సంస్ధాగత లోపాల కారణంగా చిరంజీవి పార్టీ ఇంకా పుంజుకోలేదు. ఆ పార్టీకి ఇంకా ఇప్పటికీ 30 లోపే స్ధానాలు వస్తాయన్న రాజకీయ పరిశీలకులు బాహాటంగానే ఉన్నారు. చిరంజీవి పార్టీకి ఇంత దీనమైన పరిస్ధితి ఎందుకు వచ్చినట్టు? ఒక వైపు పవన కల్యాణ్, మరో వైపు నాగబాబు, ఇంకో వైపు అల్లు అరవింద్ ప్రచారం చేస్తున్నా ఇంతటి దారుణమైన పరిస్ధితి ప్రజారాజ్యానికి ఎందుకు దాపురించినట్టు?
ప్రజారాజ్యం ఒక కుటుంబం ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శల నేపధ్యంలో ఆ పార్టీ భవిష్యత్తు కుదేలు అయిపోయినట్టు కన్పించినా టికెట్లకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారాల్లో డబ్బు సంపాదించుకున్న అగ్ర కులాల వారు రెండు కోట్ల రూపాయలు ఫండ్ గా ఇచ్చి అయినా ప్రజారాజ్యం అసెంభ్లీ టికెట్ కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు చిరంజీవి పార్టీ పరిస్ధితి ఏమిటీ? అందరినీ వెంటాడుతున్న సమస్య ఇది. రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగా అమలు జరుగుతున్నాయి. మరో వైపు చంద్రబాబు నాయకత్వంలోని మహాకూటమి కూడా బాగుంది. ఈ నేపధ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం ఎంత బాగుంటుదన్నది ప్రశ్నార్ధకం.












Click it and Unblock the Notifications