బాబుకు ఎందుకింత దీన స్ధితి?

ఇక్కడ పరిస్ధితి ఇలా ఉంటే ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను తానే ఎంపిక చేశానని చెప్పుకున్న సందర్భాలు అనేకం. అబ్దుల్ కలాం ఎంపికలో ప్రధాన పాత్ర చంద్రబాబుదే. అటువంటి చంద్రబాబు నాయుడు నేడు గ్రేటర్ హైదరాబాద్ గల్లీ నాయకుల కోసం పార్టీ ఆఫీసులో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్ధితి వచ్చింది. చంద్రబాబు పిరికితనం వదిలేసుకుని పెద్ద ఎన్టీఆర్ ను తలుచుకుని ఆయన ఆశయాలతో పనిచేస్తే దీర్ఘకాలంలో అయినా మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ బాబు అలా చేయడం లేదు. మహాకూటమి మహా ఓటమిలా మారింది.
రాజశేఖర రెడ్డి ఎలాగైతే మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడికి కులం కావాలి, కానీ కులం ముద్ర పడకూడదు. రాజశేఖరరెడ్డికి కులం కావాలి, కులం ముద్ర పడినా లెక్కచేయడు. ఇద్దరికీ అదే తేడా. ప్రజారాజ్యం నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తామన్నా రాజశేఖరరెడ్డి లైట్ గా తీసుకుని ప్రస్తుతానికి అక్కడే ఉండమని చెప్పారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఒక బస్తీ నాయకుడి కోసం పార్టీ ఆఫీసులో మూడు గంటలు వేచి ఉండి ఆయన తన పరువు తాను తన పార్టీ సీనియర్ నాయకుల ముందు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications