చిరంజీవి తెలంగాణ ప్లాన్

ఇదిలా వుంటే, చిరంజీవి ఆదివారం తెలంగాణలోని జిల్లాల పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు. వారంలోగా తెలంగాణ జిల్లాల కమిటీలను వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. కమిటీల కూర్పును ఇప్పటికే పూర్తి చేశారు. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన తర్వాత వాటిని ప్రకటిస్తారు. తద్వారా తెలంగాణ జిల్లాలో పార్టీ స్థానిక నాయకత్వాలను తన పర్యటనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణపై నిర్ణయాన్ని కూడా ఆయన సడలించుకుంటున్నారు.
సమైక్యవాదాన్ని బలపరుస్తూ ఆయన సీమాంధ్రలో విరివిగా పర్యటించారు. అయితే, క్రమంగా తన సమైక్య ఉద్యమాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని చిరంజీవి ప్రకటిస్తున్నారు. తద్వారా తెలంగాణలో తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రాణహిత పుష్కరాల సందర్శన ద్వారా తెలంగాణలో తాను ఏ మేరకు పర్యటించడానికి వీలవుతుందనే విషయాన్ని ఆయన పరీక్షకు పెట్టుకుంటున్నారు. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి ముందుగానే తెలంగాణలో తన బలాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications