జగన్ పై సోనియా పునరాలోచన?

వైయస్ జగన్ లో కొంత మేరకు మార్పు వచ్చిందని భావించి పిసిసి అధ్యక్ష పదవి కోసం జగన్ పేరును సోనియా పరిగణనలోకి తీసుకుంటారా అనేది చెప్పడం కష్టమే. మొత్తం మీద, పార్టీలో బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటన మరో వివాదానికి, చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనేది అధిష్టానం నిర్ణయమని కాంగ్రెసు నాయకులు అప్పుడే ప్రకటనలు చేయడం ప్రారంభించారు. జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వర్గం నుంచి అధిష్టానం కరుణ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి పదవి ఇవ్వజూపితే వద్దని చెప్పి వైయస్ జగన్ ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ పేరెత్తకుండా, సోనియా, మన్మోహన్ ల పేరెత్తకండా ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. ఇది జగన్ పై కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. అంతేకాకుండా, తన మాటను లెక్కచేయకుండా జగన్ వ్యవహరించడంపై సోనియా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా జగన్ తో విసిగిపోయారు. ఈ స్థితిలో జగన్ ను తిరిగి దగ్గర చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. జగన్ ను నమ్మి పిసిసి పదవి అప్పగించే స్థితిలో సోనియా ఉండకపోవచ్చు. ఒక కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడిగా కడప నియోజకవర్గానికే జగన్ పరిమితం కావాలన్నదే సోనియా అభిమతం. అయితే, జగన్ అందుకు సిద్ధపడతారా అనేది సందేహమే.












Click it and Unblock the Notifications