అన్ని పార్టీలదీ అదే సమస్య?

Chandrababu Naidu - YS Jagan
రాష్ట్రంలోన్ని అన్ని ప్రధాన పార్టీలను ఇటీవల ఓ సమస్య పట్టి పీడిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే వాస్తు సమస్య. ఇటీవల ఆయా పార్టీల వైఫల్యానికి పార్టీల కార్యాలయాలు వాస్తు ప్రకారం లేక పోవడమే అనే ఓ వాదన వినిపించింది. ఆ కారణంగానే పలు పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న వాదనలు వినిపించాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వాస్తు దోషం ఉండటంతో ఓ ద్వారాన్ని ఇటీవలె మూసి వేసిన విషయం తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ పండితులను తీసుకు వచ్చి కార్యాలయంలోని వాస్తు దోషాలను గుర్తించారట. టిడిపి చీఫ్ చంద్రబాబుకు వీటిపై నమ్మకం లేక పోయినప్పటికీ వరుసగా రెండుసార్లు పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో బావమరిది సూచనల మేరకు వాస్తు ప్రకారం కార్యాలయాన్ని మార్చి వేశారు.

అలాగే ఇటీవలి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి వాస్తు దోషం ఉండేదట. తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత పక్కనే జగన్నాథాలయాన్ని నిర్మించారు. వాస్తు ప్రకారం ఆలయ నీడ కార్యాలయంపై పడకూడదు. కానీ నీడ పడటంతో ఇటీవలి వరకు టిఆర్ఎస్ కష్టాలనెదుర్కొందనే వాదన ఉంది. వాస్తు సరిగా లేనందునే తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బాగా ఉన్నప్పటికీ తెరాస 2004, 2009లో చెప్పుకోదగిన సీట్లు గెలుచుకోక పోవడమే కాక గెలిచిన వారు కూడా టిఆర్ఎస్‌ను వీడిన సందర్భాలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో వాస్తు దోషం ఉందని ఎంతగా చెప్పినా పట్టించుకోక పోవడం వల్లనే ఆ పార్టీ గల్లంతయిందనేది పలువురి అభిప్రాయం.

మరో పార్టీ కాంగ్రెసును వాస్తు దోషాలు నిత్యం వెన్నంటుతూనే ఉంటాయట. కాంగ్రెసు పార్టీ కార్యాలయం వాస్తు ప్రకారం లేక పోవడంతో కాంగ్రెసు ముఖ్యమంత్రికి కలిసి రాదనే వాదనలు ఉన్నాయి. వైయస్సార్సీ పార్టీ పరిస్థితి అదేనట. జగన్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టాల్సిన సమయంలోనే కాస్త అటూ ఇటూగా సిబిఐ దాడులు జరగడం విశేషం. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వాస్తు సరిగా లేని కారణంగానే జైలుకెళ్లాడనే భావనతో ఆయన కుటుంబ సభ్యులు బళ్లారిలోని తన ఇంటిని వాస్తుకు అనుగుణంగా మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+