Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిసిసి రేసులో కెవిపి?

KVP Ramachandar Rao
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి రేసులో కొత్తగా మరో పేరు వచ్చి చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసి కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయ్యాక దర్శన భాగ్యం కరువైన కెవిపి రామచంద్రారావుకు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టే నిర్ణయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తుందంట. అయితే ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చింది మాత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనే వాదనలు వినిపిస్తున్నాయి. గవర్నర్ పదవి కోసమే రోశయ్య ఢిల్లీ పర్యటన అనే వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన సోనియాను కలిసింది మాత్రం ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారం పైనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ సన్నిహితంగా ఉండే వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా చేయాలనే వాదను రోశయ్య అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. గత ఏడేళ్ల నుండి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కెవిపి రామచంద్రారావు మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నందున ఆయననే పిసిసి పీఠంపై కూర్చుండ బెట్టాలని రోశయ్య కోరినట్లుగా తెలుస్తోంది. కెవిపికి ముఖ్యమైన పదవి అప్పగిస్తే జగన్ వైపు వెళ్లకుండా అడ్డుకునే శక్తి ఉందని రోశయ్య వివరించినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. అధిష్టానం అంచనాల మేరకు కిరణ్ రాణించక పోవడంతో పార్టీ ఆయన పట్ల విముఖతతో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయనను మార్చితే మరోసారి కాంగ్రెసు ముఖ్యమంత్రులను మార్చే పార్టీగా అపవాదును తలకెత్తుకోవాల్సి వస్తుందని ఆగిపోయింది. అంతేకాదు ముఖ్యమంత్రి కిరణ్ పట్ల సీనియర్ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో ఒంటెత్తు పోకడలకు వెళుతున్నాడని విమర్శలు ఉన్నాయి. పరిపాలనలో సీనియర్ల సలహాలు కూడా తీసుకోవడం లేదని పార్టీ సీనియర్లు, మంత్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా సిఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ సిఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా సిఎంపై విమర్శలు కురిపించారు. అటు పాలనలో, ఇటు పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్‌కు, అటు ప్రత్యర్థి వైయస్ జగన్‌కు చెక్ చెప్పాలంటే అందరితో మమేకం అయ్యే కెవిపే అందుకు సరియైన అభ్యర్థి అని అధిష్టానం కూడా భావించి పీఠం అప్పగించే నిర్ణయంపై తీవ్రంగా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కెవిపి ద్వారా సంక్షోభాన్ని నివారించవచ్చా అనే విషయంపై పార్టీ ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రోశయ్య సోనియాను కలవడానికి ముందు, కలిసిన అనంతరం కెవిపిని కలవడం, కెవిపి కూడా వారం రోజులుగా న్యూఢిల్లీలోనే మకాం వేయడాన్ని బట్టి కూడా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నమ్మడానికి ఆధారాలుగా లభిస్తున్నాయి. కెవిపి కూడా ఢిల్లీలోనే మకాం వేసి పీఠంపై కూర్చోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కూడా. ఇప్పటికే పిసిసి పదవి రేసులో బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా వినబడుతున్న కెవిపి పేరే చివరకు ఖాయమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. పిసిసి పీఠంపై కూర్చోవడానికి ఎవరికి వారు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా మరొకరు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే కెవిపికి ఇస్తే మాత్రం మిగిలిన వారు ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేదని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+