చిరు విలీనంపై పవన్ 'పంజా'?

pawan kalyan
'పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవికి దూరమయ్యాడా?' చిరంజీవి, పవన్ అభిమానులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. చిరంజీవి ఫ్యామిలీ సినిమాల ఆడియో, సినిమా విడుదల ఫంక్షన్లు అయితే ఆ కుటుంబ సభ్యుల హడావుడి అంతా ఇంతా కాదు. ఇటీవలి వరకు కుటుంబ సభ్యుల హడావుడి కొనసాగింది. అయితే రెండు రోజుల క్రితం పంజా ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ సోలోగా కన్పించారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనం కలిగించాయి. తాను వారసత్వాన్ని నమ్ముకొని చిత్ర పరిశ్రమలోకి రాలేదని ఆయన చెప్పారు.

వారసత్వమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు అభిమానుల్లో, అటు పరిశ్రమలోనూ తీవ్ర సంచలనం కలిగించాయి. దీంతో పవన్‌కు చిరంజీవితో మనస్పర్ధలు వచ్చినందు వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చకు తెర లేచింది. అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడమే వారి మనస్పర్ధలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ బలోపేతానికి పవన్, నాగబాబు తీవ్రంగా కృషి చేశారు. యువరాజ్యానికి పవనే అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా. పిఆర్పీ అధికారంలోకి రాకపోయినప్పటికీ పవన్‌లో నిరుత్సాహం కనిపించక పోవడంతో పాటు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుదనే భావనలో ఉండేవాడట.

తదుపరి ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్లాలనే యోచనలో ఉండేవాడట. ఇక కాంగ్రెసు పార్టీ అంటే పవన్‌కు అస్సలు గిట్టదు. ఇలాంటి సమయంలో విలీనం అంశం తెరపైకి వచ్చింది. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసే అంశం పవన్‌కు అస్సలు నచ్చక పోవడంతో తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ విలీనం జరిగిపోయింది. దీంతో పవన్‌కు చిరుతో అభిప్రాయబేధాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా మొదలైన ఈ అభిప్రాయబేదాలు నాగబాబు నిర్మాతగా రాంచరణ్ తేజ హీరోగా వచ్చిన ఆరెంజ్ చిత్రంతో ఇంటి వరకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. మగధీర హిట్ తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం అట్టర్ ప్లాప్ కావడంతో నాగబాబుకు చిరంజీవి క్లాస్ తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇదీ పవన్‌‌ను బాగా హర్ట్ చేసిందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+