కెసిఆర్‌తో వైయస్ జగన్ దోస్తీ?

మరోవైపు జగన్ కూడా తెరాసతో సఖ్యత కొనసాగిస్తూనే తెలంగాణలో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. ఇటీవల జరిగిన తెలంగాణ జిల్లా నేతల సమీక్షలో ఆయన పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని, స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సూచించారు. ఇందులో భాగంగానే బాన్సువాడ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెరాసకు అంతర్గతంగా మద్దతిచ్చినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిబిఐ దర్యాఫ్తు వేగవంతమైన తర్వాత జగన్ వ్యాఖ్యల్లో పదును తగ్గింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మాటల తూటాలు తగ్గించారు. ప్రస్తుతం జగన్ కేవలం రాష్ట్ర నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అవసరమైతే యుపిఏకు మద్దతిస్తామన్నారు. ఇక కెసిఆర్ కూడా తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే కాంగ్రెసుతో సత్సంబంధాలు నెరుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 2014 నాటికి సీమాంధ్ర నుండి జగన్, తెలంగాణ నుండి కెసిఆర్ యుపిఏకు మద్దతు పలికే అవకాశాలు దండిగా ఉన్నాయి. తెలంగాణ ఇస్తే కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానే వాదనలూ వినిపిస్తున్నాయి. జగన్, కెసిఆర్ చేయి కలిపి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి తద్వారా యుపిఏకు మద్దతు పలకవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో జగన్ ఎంట్రీ కోసం కొన్ని సామాజిక వర్గాలు ఎదురు చూస్తుండటం విశేషం.












Click it and Unblock the Notifications