వైయస్ జగన్ ప్రసంగాలు రొటీన్

YS Jagan
కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రసంగాలు రొటీన్‌గా మారాయి. ఎక్కడికి వెళ్లిన మాట్లాడిందే మాట్లాడుతున్నారు. కొత్త విషయాలు ఆయన ప్రసంగంలో ఉండడం లేదు. అయితే, ఎక్కడికక్కడ అంతుకు ముందు తన సభలకు రాని ప్రజలు ఉంటారు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలకు అదే విషయాన్ని చేరవేయడం ఆయన ఉద్దేశం కూడా కావచ్చు. కానీ క్రమం తప్పకుండా ఆయనను, ఆయన ప్రసంగాలను గమనిస్తున్నవారికి మాత్రం అవి రొటీన్‌గానే అనిపిస్తున్నాయి.

ఒక తల్లిని, ఒక కొడుకును వేధించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా చేసిన విమర్శలనే చేస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఆయన అంటున్నారు. మన రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షంతో కలిసిపోయిందని, ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్రను తెలుగుదేశం నిర్వహించడం లేదని, చంద్రబాబులాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం ప్రజల దురదృష్టమని ఆయన అంటున్నారు. కృష్ణా జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించి నెలకు దగ్గరవుతోంది. నెలకు కొద్ది రోజులు తక్కువగా ఆయన ప్రసంగాలు ఒకే విధంగా సాగుతున్నాయి.

అయితే, జగన్ ముఖంలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ముఖం వాడిపోయినట్లు కనిపిస్తోంది. జగన్ తీవ్రంగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, కాంగ్రెసు నుంచి బయటకు రావడంతోనే తనపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని, కాంగ్రెసులో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆయన అంటున్నారు. కాంగ్రెసుపై గతంలో చేసినంత తీవ్రంగా ఆయన ఆరోపణలు చేయడం లేదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై గతంలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటి వేడిని తగ్గించారు. మొత్తం మీద, స్థానిక ప్రజలను ఆయన ప్రసంగాలు ఆకట్టుకుంటూ ఉండవచ్చు గానీ క్రమం తప్పకుండా గమనిస్తున్నవారికి మాత్రం రొటీన్‌గానే అనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+