జగన్ కేసు: పారని విజయ సాయి రెడ్డి స్కెచ్

Vijaya Sai Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ-2 నిందితుడిగా ఉన్న జగతి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి సిబిఐ, ఈడిలను ఎదుర్కొనడానికి వేసిన స్కెచ్‌లు ఫెయిల్ అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ సామ్రాజ్య నిర్మాణంలో సాయి రెడ్డిది కీలక పాత్ర అనే వాదనలు ఉన్నాయి. దీంతో జగన్ ఆస్తులకు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు తెలుసనే కారణంతో సిబిఐ అతనిని అనేకసార్లు విచారించింది. అయితే విచారణ సమయంలోనే విజయ సాయి రెడ్డి సిబిఐ, ఈడిలను టార్గెట్ చేసుకొని కోర్టుకు వెళ్లడం విశేషం. దర్యాఫ్తును జాప్యం చేయడానికే అతను కోర్టుకెక్కారనేది కొందరి వాదన.

విచారణ సమయంలో సాయి రెడ్డి సిబిఐ అడిగే ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా ఉండేవి కావు. ఈ విషయాన్ని అధికారులే స్పష్టం చేశారు. తాము రోజుల తరబడి విచారించినా ఆయన ఇచ్చిన సమాచారం అసంబద్ధంగా ఉందంటూ సిబిఐ, ఈడి దర్యాఫ్తు సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నిసార్లు విచారించినా సాయిరెడ్డి తమకు ఏమాత్రం సహకరించడం లేదని దర్యాఫ్తు నుండి ఎలా తప్పించుకోవాలో ఆయనకు తెలుసునని సిబిఐ న్యాయస్థానంలోనే స్పష్టం చేసింది. జగన్ కేసులో సిబిఐ పరిధి దాటుతోందంటూ ఆయన సిబిఐ ప్రత్యే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సాక్షులను ఒత్తిడి చేసి సిబిఐ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. దర్యాఫ్తు నుండి తప్పించుకోవడానికే ఆయన పిటిషన్ ఎత్తుగడ వేశారని సిబిఐ కోర్టులో వాదించింది. ఆ తర్వాత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టి వేసింది.

ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం సిబిఐ ఏర్పడిందని, దానిలోని ఒక నిబంధన కారణంగా రాష్ట్రాల కేసులను విచారించే అధికారం దానికి దాఖలు పడుతోందని, ఆ నిబంధనను రద్దు చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురే అయింది. ఇక వరుసగా మూడు రోజులపాటు ఈడి విచారణకు హాజరైనా ఆయన ఇచ్చిన జవాబులపై అధికారులు అసంతృప్తినే వ్యక్తం చేశారు. దీనితో దర్యాప్తును షెడ్యూలు కంటే పొడిగించింది కూడా. వీటికితోడు, తనకు ప్రాణ హాని ఉందంటూ సాక్షాత్తూ డిజిపికే ఆయన లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి, ఏదైనా కేసులో ఉన్న నిందితుడికి సెక్యూరిటీని కల్పించరు. కానీ, ఈ కేసులో సాయి రెడ్డికి మాత్రం భద్రత కల్పించారు. ఇలా దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి, దానిని జాప్యం చేయడానికి ఆయన ఎన్ని స్కెచ్‌లు వేసినా ఫలించనట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+