కెసిఆర్ పునాదులు కదులుతున్నాయా?

అలాగే, మహబూబ్‌నగర్ శానససభ నియోజకవర్గానికి సంబంధించి కూడా కెసిఆర్ ప్రయత్నాలు ఫలించడం లేదని అంటున్నారు. నిజానికి, స్థానిక శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి మరణించడం వల్ల దీనికి ఉప ఎన్నిక వస్తోంది. రాజేశ్వర రెడ్డి సతీమణిని కెసిఆర్ తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే, ఆమె అందుకు సిద్ధపడడం లేదని సమాచారం. నిజానికి, ఈ సీటులో తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత శ్రీనివాస గౌడ్‌ను పోటీకి దించాలని తెరాస నాయకత్వం భావించిందని అంటారు. రాజేశ్వర రెడ్డి సతీమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తెరాసకు ఈ సీటును గెలుచుకోవడం కష్టమే అవుతుంది.
మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి తెరాస మద్దతు ప్రకటించాల్సి రావచ్చు. నాగం జనార్దన్ రెడ్డి తెరాసలోకి రావడానికి ఇష్టపడడం లేదు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని చెబుతున్నారు. తెలంగాణ కోసమే రాజీనామా చేశారు కాబట్టి నైతికంగా కెసిఆర్ ఆయనకు మద్దతు ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. నాలుగు సీట్లు అలా పోతే మిగిలింది ఆదిలాబాద్, కోల్లాపూర్ నియోజకవర్గాలు. ఈ సీట్లు తెరాసకు రావడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. బిజెపి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడం, పోలవరం టెండర్ల విషయంలో కెసిఆర్ ఏదో మేరకు బద్నాం కావడం తెరాసకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అంటున్నారు. ఏమైనా, ఆరు స్థానాల్లో ఎన్ని సీట్లు వచ్చినా అది తెరాసకు అదనమే.












Click it and Unblock the Notifications