బొత్స సత్తిబాబు ఎందుకు రెచ్చిపోయారు?

పైగా, ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారనే అభిప్రాయం ఆయనకు కలిగినట్లు చెబుతున్నారు. మద్యం సిండికేట్ల నివేదికను అడ్డు పెట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి తనను బెదిరిస్తున్నారని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది కాబట్టి మద్యం సిండికేట్లపై ఎసిబి సమర్పించిన నివేదికను బయట పెట్టక తప్పడం లేదనే పరిస్థితిని కల్పించడం కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశమని అంటున్నారు.
మద్యం సిండికేట్లపై ఎసిబి నివేదికను బయటపెడితే బొత్స సత్యనారాయణకు తిప్పలు తప్పవని అంటున్నారు. బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్లపై శానససభా సమావేశాలను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. తన పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్న బొత్స సత్యనారాయణను ఆ విధంగా దెబ్బ తీయాలనే ఎత్తుగడలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ అంతగా రెచ్చిపోయారనే మాట వినిపిస్తోంది. తన ఆంతర్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డికి చేరవేయడానికి మొదటి ప్రకటనను ఆయన ఉద్దేశించగా, రెండో ప్రకటనను తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పుకోవడానికి చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications