కెసిఆర్ తీరు సస్పెన్స్: 'టి'పై ఏకాకీని చేసేందుకా?

తెలంగాణపై తేల్చే అవకాశమున్నా, సాగదీసే వైఖరి ఉన్నా... విభజన విషయమై రాష్ట్రంలో గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ బయటకు రాకపోవడం విశేషం. అంతేకాకుండా కాంగ్రెసు పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా పుట్టుకు వచ్చిన ప్రజా సంఘాల జెఏసి, నాయకులను కూడా దగ్గరకు తీస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోను కెసిఆర్ మౌనంగా ఉండటంపై చర్చసాగుతోంది. కొద్దికాలం క్రితం వరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన కెసిఆర్, అనూహ్యంగా ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను తెరాసలో చేర్చుకొని సంచలనం సృష్టించారు. ఒకవైపు కాంగ్రెస్‌ను నమ్మలేమంటూనే, మరోవైపు తెలంగాణ ఇస్తే ఆ పార్టీలో విలీనానికి తెరాస సిద్ధమనే సంకేతాలిస్తోందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూన్ 30న తెలంగాణ సాధన సభ ఏర్పాటు చేసి దూకుడు పెంచినప్పటి నుండి కెసిఆర్ మౌనం వహిస్తున్నారంటున్నారు.
సభ ఊపులో ఉన్న కాంగ్రెసు కాంగ్రెస్ ఏకకాలంలో తెలంగాణ జెఏసి, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలను తమ చుట్టూ తిప్పుకునే ఎత్తుగడను ఆచరణలో పెట్టింది. కొంతకాలంగా కెసిఆర్, తెరాస వైఖరితో విసిగివేసారిన వారంతా కొత్తగా స్నేహహస్తం చాచిన కాంగ్రెస్ ఒడిలో సేద తీరటానికి తాపత్రయపడుతున్నారు. అయితే తెలంగాణ ఇస్తేనే వారు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇన్నాళ్లూ తెరాస టిక్కెట్ కోసం తాపత్రయపడిన పలువురు కాంగ్రెసు తెలంగాణపై ప్రకటన చేస్తే అటు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారట.
ఒకవేళ కాంగ్రెస్‌లో తెరాస విలీనమైతే కెసిఆర్ కాదన్నా టికెట్ సాధించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తెరిచి పెట్టుకుంటున్నారట. కాంగ్రెసు తెలంగాణను నాన్చుతోందని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. ఢిల్లీ పెద్దలను కలిసిన పలువురు జెఏసి సంఘాల నేతలు తెలంగాణపై కొద్దిరోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారట. తెలంగాణకు అనుకూలంగా తప్పకుండా నిర్ణయం ఉంటుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కూడా బలంగా చెబుతున్నారు.
తెలంగాణ తేల్చుతుందో, తేల్చదో అర్థం కాక తెరాసలో అయోమయం నెలకొందంటున్నారు. కాంగ్రెసు తేల్చకుంటే తమకు భారీగా లబ్ధి చేకూరుతుందని, తెలంగాణ ఇస్తే మాత్రం పార్టీకి ఇబ్బందులు తప్పవని పునరాలోచనలో పడ్డారట. ఇక కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఏముందో? తాము ఏ రకంగా వ్యవహరించాలి? ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందో? అనే ఆందోళనలో తెరాస వర్గాలున్నాయని అంటున్నారు.
కెసిఆర్‌తో కాంగ్రెస్ ఇదివరకే సంప్రదింపులు జరిపిందని, తెలంగాణ ఐకాస సహా ఇతర సంఘాలేవీ ఆయన చెప్పుచేతల్లో లేవని గుర్తించడం వల్లనే నేరుగా రంగంలోకి దిగి వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో తెలంగాణ సంఘాలన్నింటినీ ఒకసారి దగ్గర చేసుకుంటే కెసిఆర్ తనంతట తానుగా తమ దగ్గరికి వస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని, అందుకే ఆయనను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతోందనే వాదన కూడా ఉందని అంటున్నారు.
కెసిఆర్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, ఆయనను ఏకాకి చేసే దిశగా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై కాంగ్రెస్ తన మార్కు రాజకీయాలు చేస్తున్నప్పటికీ, పార్టీ అగ్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం వెనుక అంతరార్థం ఏమిటో తెలియక తెరాస క్యాడర్ అయోమయానికి గురవుతోందని అంటున్నారు. తెలంగాణ ఇస్తుందనే ప్రచారం జోరుగా జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి పోతే తమ పార్టీ లాభపడుతుందని, నిజంగానే ఇస్తే తమ పార్టీ భవిష్యత్తేమిటనే ఆందోళన క్యాడర్‌లో ఉందంటున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications