టిడిపిలోకి నటుడు అలీ: రాజమండ్రి నుంచి పోటీ?

రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేయబోతున్న మురళీ మోహన్ ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈసారి గెలిచేందుకు అవసరమైన మార్గాలన్నింటినీ వెతుక్కుంటున్నారు. దీంతో రాజమండ్రి లోకసభ స్థానంలోని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను దించేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తన వ్యూహరచనలో భాగంగా మురళీ మోహన్ రాజమండ్రి శాసనసభ స్థానం నుంచి నటుడు అలీని పోటీకి దించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఆయన అలీతో మాట్లాడినట్లు, అలీ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అలీ పోటీ విషయంలో మురళీ మోహన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అనమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజమండ్రి శాసనసభా స్థానం అలీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications