చిన్నవిషయానికి అవార్డు వెనక్కిచ్చేంత మూర్ఖుడినా: ప్రకాశ్ రాజ్ యూటర్న్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జాతీయ అవార్డులు వెనక్కి ఇచ్చే అంశంపై యూ టర్న్ తీసుకున్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెబుతున్నారు.
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జాతీయ అవార్డులు వెనక్కి ఇచ్చే అంశంపై యూ టర్న్ తీసుకున్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెబుతున్నారు.

చర్చనీయాంశమైన హెచ్చరిక
జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ పెదవి విప్పకపోతే తనకొచ్చిన జాతీయ అవార్డులు తిరిగిచ్చేస్తానని హెచ్చరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు
కానీ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కష్టపడి సాధించిన అవార్డులు తిరిగిచ్చేయడానికి మూర్ఖుడిని కాదని అంటున్నారు ప్రకాశ్ రాజ్. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అవార్డు వెనక్కి వార్తలు చూసి నవ్వుకున్నాను
'నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ అవార్డులు తిరిగి ఇచ్చేస్తారట అని వస్తున్న వార్తల్ని చూసి నవ్వుకున్నాను. నేనంత మూర్ఖుడిని కాను. నా పనికి నేను గెలుచుకున్న అవార్డులు అవి. అందుకు నేను గర్వపడుతున్నాను కూడా. కానీ నేను స్టేజ్ మీద కొన్ని విషయాలను ప్రస్తావించాను.' అని ప్రకాశ్ రాజ్ అందులో చెప్పారు.

మోడీ పెదవి విప్పడం లేదు, నాకు భయమేస్తోంది
ఇంకా, అంతటి గొప్ప పాత్రికేయురాలు హత్యకు గురైతే మన ప్రధాని మోడీ ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం గమనార్హమని, మన ప్రధాని ఈ విషయంలో మౌనంగా ఉంటే ఓ పౌరుడిగా తనకు భయమేస్తోందని, తాను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు.

చిన్న విషయానికి ప్రకాశ్ రాజ్ అవార్డులు వెనక్కిస్తారని ప్రచారం
కేవలం ఈ విషయంలో మన ప్రధాని మోడీ సైలెంట్‌గా ఉన్నారని, అది తనను బాధపెడుతోందని మాత్రమే చెప్పానని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఓ పౌరుడిగా తనకు అలా అనే హక్కు ఉందని చెప్పారు. ఇంత చిన్న విషయానికి ప్రకాశ్ రాజ్ అవార్డులు ఇచ్చేస్తానన్నారని ప్రచారం చేయడంలో అర్థం లేదన్నారు. ఆ మాట తాను అనలేదని చెప్పారు. తనకు అవార్డులు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన కూడా లేదన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications