మోడీ బాటలో చంద్రబాబు: ట్విట్టర్ ఖాతా

హైదరాబాద్‌ను ఐటి హబ్‌గా నిలబెట్టాలని కలలు కంటూ తాను ఐటి కంపెనీలు రావడానికి కృష్టి చేశానని, హైటెక్ సిటీ ఏర్పాటు తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. 1984లోని తన మొదటి కంప్యూటర్ నుంచి ట్విట్టర్‌లోకి ఈ రోజు అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో పారదర్శకత, నిబద్ధత నుంచి ఉద్యోగల కల్పనకు.. టెక్నాలజీకి థ్యాంక్స్ అని ఆయన ట్వీట్ చేశారు.
దానికితోడు మరో రెండు ట్వీట్స్ కూడా చేశారు. "99-04 6,00,00,000 నెట్ జాబ్స్ యాడెడ్. 2004-09 జీరో నెట్ జాబ్స్ యాడెడ్. యుపిఎ అవినీతి. క్యాన్సర్ ఉద్యోగాలను తినేస్తోంది. చర్యకు దిగండి" అని ఆయన ట్వీట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో పరిస్థితిని సమీక్షించామని రాసి ఫొటో కూడా యాడ్ చేశారు.
తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది ఫేస్‌బుక్‌లో చాలా చురుగ్గా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆలోచనలను, నినాదాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి ప్రయత్నస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు వంటి టిడిపి నాయకులు ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచారు. ట్విట్టర్ ఖాతాలను పర్యవేక్షించడానికి ఓ యువ బృందాన్ని తెలుగుదేశం పార్టీ నియమించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వాడకంపై కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications