స్మితపై కథనం: ‘ఔట్‌లుక్‌’పై సర్వత్రా ఆగ్రహం

హైదరాబాద్: ఆంగ్ల పత్రిక ‘అవుట్ లుక్' తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా, ఆమె గురించి రాసిన కథనంపై సర్వత్రా ఆగ్రహానికి గురి చేసింది. కాగా, తన

పరువుకు నష్టం కలిగించేలా, అమర్యాదకరంగా, అభ్యంతరకరంగా, అశ్లీలం ధ్వనించేలా ఔట్‌లుక్ పత్రిక ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.

ఔట్‌లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్‌కు, కథనం రాసిన అసిస్టెంట్ ఎడిటర్ (హైదరాబాద్) మాధవి తాతలకు లీగల్ నోటీసు పంపారు. ‘డీప్ థ్రోట్' పేరుతో కావాలని తప్పుగా రాసిన కాలమ్‌లో పేర్కొన్న విషయాలు తన క్లయింట్‌కు తీవ్ర మనోవేదన కలిగించాయని స్మితా సబర్వాల్ న్యాయవాది బీ రచనారెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

criminal case to be filed on outlook magazine orders telangana cs

క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి, మహిళా ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌పై అసభ్య కథనం ప్రచురించిన ఆంగ్ల పత్రిక 'అవుట్‌లుక్‌'పై క్రిమినల్‌ కేసు నమోదుచేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం డీజీపీని ఆదేశించారు.

స్మితను కించపరిచేలా కథనాన్ని, చిత్రాన్ని ప్రచురించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం కేసీఆర్‌ ఈ కథనాన్ని ఖండించారు. ఆయన ఆదేశాల మేరకు సీఎస్‌ డీజీపీతో మాట్లాడారు. ఒక అధికారిణిని అవమానించేలా రాయడం గర్హనీయమంటూ, వెంటనే చర్యలకు ఆదేశించారు. మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సీఎస్‌ రాజీవ్‌శర్మను కలిసి, ఆ కథనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

పత్రిక యాజమాన్యం, సంపాదకుడు, సంబంధిత విలేకరిపై కఠినచర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. మంగళవారం హైదరాబాద్‌లో అత్యవసర కార్యవర్గ మావేశాన్నిఏర్పాటుచేసింది. మరోవైపు స్మితాసబర్వాల్‌.. అవుట్‌లుక్‌ ప్రధాన సంపాదకులు, హైదరాబాద్‌లోని సహాయ సంపాదకులకు నోటీసులిచ్చారు. క్షమాపణ చెప్పకుంటే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణతో పాటు పలు పాత్రికేయ సంఘాలు, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం స్మితకు సంఘీభావం తెలిపాయి. మహిళా అధికారిణి అన్న గౌరవం, మహిళ అనే మర్యాద లేకుండా స్మితాసబర్వాల్‌పై అసభ్య కార్టూన్లు వేసి, దానిని పాత్రికేయం అనుకోవడం సిగ్గుచేటని తెలంగాణ బీసీఫోరం రాష్ట్ర సమన్వయకర్త గుండగాని కిరణ్‌గౌడ్‌ విమర్శించారు.

మంగళవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో అవుట్‌లుక్‌ వారపత్రిక ప్రతులను విద్యార్థులు దహనంచేశారు. పత్రిక యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫోరం హైదరాబాద్‌ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, శ్రీమాన్‌గౌడ్‌, రాహుల్‌, వీరేందర్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+