వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలతో జల్సా: నయీంకు ప్రాణాంతక వ్యాధి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విలాసవంతమైన లైఫ్ స్టయిల్‌కు అలవాటు పడిన నయీం ప్రాణాంతక వ్యాధికి చికిత్స పొందుతున్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. నయీం ఇంట్లో సోదాల సమయంలో దీనికి సంబందించి మందులను పోలీసులు కనుగొన్నారు.

ఎప్పుడు అమ్మాయిలతో ఉండే నయీం కొంతకాలంగా చికిత్స పొందుతున్నట్లు మందులు, మెడికల్ రిపోర్టుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నయీం ఇంట్లో ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు అమ్మాయిలను పోలీసులు గుర్తించారు. తన అవసరాలకు అమ్మాయిలను వాడుకొని అనంతరం వారిని ముఠాలకు నయీం విక్రయించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్నవి ఇవే..

నయీం ఇంట్లో పోలీసులు వేలాది కోట్ల రూపాయల ఆస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.2,08,52,400 నగదుతో పాటు 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్‌ఫోన్స్, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పది జిలిటెన్ స్టిక్స్‌, పది డిటోనేటర్లు, నాలుగు పిస్టల్స్‌, డమ్మీ రివాల్వర్, 227 లైవ్‌ రౌండ్స్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆడి క్యూ7కారు(ఏపీ09బీఎస్‌4959), రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌(టిఎస్08ఈకే7587), హీరోగ్లామర్‌ బైక్‌(టిఎస్ 08ఈకే7430), హీరో కరిజ్మా (ఏపీ24ఏవై0827), యమహా (ఏపీ29ఏజడ్‌7081), స్కూటీ(టిఎస్08ఈడీ7995), హోండా యాక్టివా (టిఎస్11ఈబీ8278) స్వాధీనం చేసుకున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు, పెనడ్రైవ్‌లు, ల్యాండ్‌ సెటిల్మెంట్‌ వివరాలు రాసుకున్న బుక్స్‌, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్, పెనడ్రైవ్స్‌, సీడీలు, ల్యాప్‌టా్‌పలు, బండిల్స్‌ కొద్ది చెక్‌బుక్స్, బ్యాంకు పాస్‌బుక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కొండపూర్‌లో 69 ఎకరాల భూమి, పుప్పల్‌గూడ, మణికొండతోపాటు హైరాబాద్‌లో పదుల సంఖ్యలో ఖరీదైన ప్లాట్లు, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, రామాంతపూర్‌, అమీర్‌పేట్‌ ప్రాంతాల్లో స్థలాలకు సంబంధించిన పత్రాలు, నల్లగొండ జిల్లా భువనగిరి బొమ్మల రామారం రైల్వేస్టేషన్ సమీపంలో వందల ఎకరాల స్థలం, శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద స్థలాలు, సరూర్‌నగర్‌లో 1180 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లా, ఏపీలోని గుంటూరు జిల్లాలో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

షాద్‌నగర్‌ మిలీనియం టౌన్‌షిప్‌ ఇంటిలో.. రెండు ఏకే 47 గన్స్‌, ఒక సైట్‌గన్‌, మరో పిస్టల్‌తో పాటు పెద్ద మొత్తంలో బుల్లెట్లు రూ.3,75,600 నగదు.

Gangster Nayeem proposes, but God disposes

ఇంట్లో పత్రాల గుట్టలు

నయీం ఇంట్లో దొరికిన పత్రాలను పోలీసులు మంగళవారం కోర్టులో సమర్పించారు.
నల్గొండ జిల్లా భువనగిరి టీచర్స్ కాలనీలో 175 ప్లాట్లు.
సరూర్ నగర్లో అయిదెకరాల భూమి. ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్లో భూమి.
రామంతాపూర్‌లో 35.20 ఎకరాల భూమి.
శ్రీసాయి కన్ స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అగ్రిమెంట్.
డిఎస్పీ సూచన మేరకు మన్సూరాబాదులో గౌలిపురా లాల్ భాయికి సంబంధించిన వీలునామా.
సరూర్ నగర్ ఎన్టీఆర్ నగర్లో 1180 చదరపు అడుగుల భూమి ప్లాన్.
గుంటూరు జిల్లా చినకాకానిలోని కళ్యాణిలో భూమి.
రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ప్లాట్.
శేరిలింగపంపల్లి కొండాపూర్లో భూమి.
మెదక్ జిల్లా అమీన్ పురకు చెందిన భూమి పత్రాలు.
హైదరాబాదులోని షేక్ పేటలో భూమి. మన్సూరాబాదులో భూమి.
జూబ్లీహిల్స్లో 1365 గజాలు. తార్నాకలో భూమి సెటిల్మెంట్ పత్రాలు.
సైదాబాదులోని సూర్యప్రకాశ్ రెడ్డికి చెందిన 300 గజాల స్థలం కాగితాలు.
కీసర మండలం నాగారం గ్రామంలో వెయ్యి గజాల భూమి.
బైరామల్ గూడలోని భూమి ధ్రువపత్రాలు.
కరీంనగర్ జిల్లా నగునూరులో అవుటడ్ లేట్ పత్రాలు.
ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బావమరిది వీరమల్లు ఆంజనేయులుతో రూ.3.5 కోట్ల నగదు లావాదేవలు జరిపినట్లుగా ఉంది. ఆ సుధీర్ రెడ్డి బంధువులు దీనిని ఖండించారు. ఆ పేరుతో బంధువులు లేరని చెప్పారు.
రూ.వెయ్యి నోట్లు 12,538, రూ.అయిదువందల నోట్లు 16,2920, రూ.వంద నోట్లు 1,652 తో పాటు చిల్లర దాదాపు నాలుగున్నర వేలు ఉంది. 1,934 కిలోల బంగారు నగలు, 877 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయి.

విలాసవంతమైన లైఫ్ స్టయిల్‌కు అలవాటు పడిన నయీం ప్రాణాంతక వ్యాధికి చికిత్స పొందుతున్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. నయీం ఇంట్లో సోదాల సమయంలో దీనికి సంబందించి మందులను పోలీసులు కనుగొన్నారు.

English summary
Gangster Nayeem proposes, but God disposes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X